Priyanka reddy murder: పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..చెట్టుకు 4గురి దిష్టిబొమ్మలను ఉరి తీసి నిరసన

నలుగురు మృగాళ్ల చేతిలో దారుణంగా అత్యాచారం గావించ బడి,హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు పరచనున్నారు. దీంతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముట్టడించారు.

ఉరి తీయాల్సిందే అని, ఎన్ కౌంటర్ చేయాల్సిందే .. షాద్ నగర్ పీఎస్ వద్ద ఆందోళన

ఉరి తీయాల్సిందే అని, ఎన్ కౌంటర్ చేయాల్సిందే .. షాద్ నగర్ పీఎస్ వద్ద ఆందోళన

ప్రియాంక హంతకులను ఉరి తీయాల్సిందే అని, ఎన్ కౌంటర్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రియాంక రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న విద్యార్థినులు నలుగురు నిందితుల దిష్టి బొమ్మలను చెట్టుకి ఉరితీసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక స్థానికులు పీఎస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత

దీంతో పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన ఆ నలుగురు మృగాళ్ళకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న వారి ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో, ఆందోళన చేస్తున్న వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.ఈ కేసులో మహ్మద్ పాషా ఏ1, బొల్లు శివ ఏ2, బొల్లు నవీన్ ఏ3, చెన్నకేశవులు ఏ4 నిందితులు. పక్కా ప్లాన్ ప్రకారం డాక్టర్ ప్రియాంకను బలి తీసుకున్నారు. లైంగిక దాడి చేసి ప్రాణం తీశారు. మృతదేహం పైన కూడా లైంగిక దాడి చేశారు.

నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

ఆమె మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టారు. ఇక నవంబర్ 30,2019 నేడు ప్రియాంక హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకోసం నిన్నటి వరకు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్న వీరిని నేడు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మహబూబ్ నగర్ కి తరలిస్తారు.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు

    నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు

    ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వారిని హాజరుపరుస్తారు. అంతేకాకుండా మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నిందితులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో అవకాశం ఉందని సమాచారం. ఆగ్రహావేశాలతో ఉన్న స్థానికులకు, విద్యార్థినులకు పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తామని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రియాంక రెడ్డి హత్య విషయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఆగ్రహావేశాలు, ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+