ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
హైదరాబాద్: ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును సికింద్రాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం - కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్‌రావునగర్‌లో కొంతకాలంగా హరీశ్(35), కావ్య(30), దిదీఖాన్(45) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. వ్యభిచారం చేస్తున్న అనంతపురానికి చెందిన షేక్ చేబాన్(27)తోపాటు విటులు యూసుఫ్‌గూడకు చెందిన ఫణికుమార్(27), ఏలూరు శ్రీరాంనగర్‌కు చెందిన విజయ్‌కుమార్(34)ను అదుపులోకి తీసుకున్నారు.
అదే విధంగా, నిర్వాహకులు దిదీఖాన్‌ను అరెస్ట్ చేయగా, హరీశ్, కావ్య పరారీలో ఉన్నారు. వీరి నుంచి ఆరు వేల నగదుతోపాటు ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గొడవ పడి వివాహిత అదృశ్యం
ఇంటి యజమానితో గొడవపడి వివాహిత ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన సంఘటన నల్లగొండ జిల్లా మహ్మదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన ఎం. ఎల్లయ్య గండీడ్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య అర్చన, కుమారుడు లక్కీతో కలసి మహ్మదాబాద్‌లోని బండకాడి కృష్ణవేణి ఇంట్లో అద్దెకుంటున్నాగు.
గత నెల 30న ఇంటి యజమానితో అర్చన గొడవపడింది. ఇంటికి వచ్చిన భర్తకు ఆమె గొడవ జరిగిన విషయం చెప్పింది. దీనిపై భర్త స్పదించకపోవడంతో మరుసటి రోజు ఆమె కొడుకుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన ఎల్లయ్య ఈ విషయం తెలుసుకొని తెలిసినవారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాసేందర్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications