పార్క్ హోటళ్లో మోడల్స్‌తో వ్యభిచారం: పారిశ్రామికవేత్తల కొడుకుల పరార్
హైదరాబాద్ నగరంలో మరో హైటెక్ క్స్ రాకెట్ గుట్టురట్టయింది. సోమాజీగూడలోని పార్క్ హోటల్లో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తల తనయులు ఢిల్లీ నుంచి రప
హైదరాబాద్: నగరంలో మరో హైటెక్ క్స్ రాకెట్ గుట్టురట్టయింది. సోమాజీగూడలోని పార్క్ హోటల్లో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తల తనయులు ఢిల్లీ నుంచి రప్పించిన మోడళ్లతో రెండు రోజులుగా రాసలీలల్లో మునిగి తేలుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు.
అయితే, అప్పటికే పారిశ్రామిక వేత్తల తనయులు, వ్యభిచారం దందా నిర్వాహకుడు సుధాకర్‌రెడ్డి తప్పించుకొని పారిపోయారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ మోడల్.. వ్యభిచార నిర్వాహకుడి సహాయకుడు నర్సింహులు దొరికిపోయారు.
పశ్చిమ మండలం పోలీసులు కృష్ణానగర్‌కు చెందిన నర్సింహులు నుంచి రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. మోడల్‌ను రెస్కూ హోంకు తరలించారు. ఢిల్లీకి చెందిన మోడల్‌ను పారిశ్రామిక వేత్తల తనయుల కోసం గురువారం ప్రత్యేకంగా పిలిపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కీచక తండ్రిని హత్య చేశారు
కన్నకూతురిని వేధిస్తున్న ఓ కీచక తండ్రిని అన్నాచెల్లెళ్లు కలిసి హత్యచేశారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలిలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కోడ్రంగె రాజేశ్వర్(40)మద్యానికి బానిసై వేధిస్తుండటంతో భార్య విమలాబాయి రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది.
కుమారుడు (16), కూతురు(14) తండ్రి వద్దే ఉంటున్నారు. రెండు నెలల కిందట రాజేశ్వర్ మద్యం మత్తులో కూతురుపై లైంగికదాడికి ప్రయత్నించగా కుమారుడు అడ్డుకున్నాడు. అప్పటినుంచి రాజేశ్వర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని వేధిస్తున్నాడు. దీంతో అన్నాచెల్లెళ్లు గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాజేశ్వర్ గొంతుకు తాడుతో ఉరిబిగించి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications