వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాంటిన్ లో ప్లకార్డులతో నిరసన.!పార్లమెంట్ లో చేసినట్టు ఫోటోలు. గులాబీ ఎంపీలకు సిగ్గుండాలన్న సంజయ్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాల మూడో రోజు కూడా తెలంగాణ రైతాంగం పండిచిన వరి ధాన్యం కొనుగోలు మీద రచ్చ చోటుచేసుకుంది. రా రైస్ కొంటామని కేంద్రం చెప్పుకొస్తున్నా ఎందుకు నిరసన తెలుపుతున్నారని బీజేపి ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సభలో గందరగోళం సృష్టించడం మంచి సంప్రదాయం కాదని తెలిపారు. ఎందుకు ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారో అర్దం అవుతుందా అని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ఐనప్పటికి టీఆర్ఎంపీలు నినాదాలు ఆపకపోవడంతో బీజేపి ఎంపీలు కూడా నినాదులు చేసారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.

ధాన్యం ఎందుకు సేకరించడం లేదు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలను నిలదీసిన బండి సంజయ్

ధాన్యం ఎందుకు సేకరించడం లేదు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలను నిలదీసిన బండి సంజయ్

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం లోక్ సభలో గొడవ చేస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అడ్డుకున్నారు. వానా కాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనే దిక్కులేక వరి కుప్పలపై పడి రైతులు ప్రాణాలిడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గులాబీ ఎంపీలను నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలకు ధీటుగా బండి సంజయ్ నినాదాలు చేస్తూ ఆ పార్టీ సభ్యుల తీరును ఎండగట్టారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ ఎంపీ సోయం బాబూరావు సభలో లేచి నిలబడి టీఆర్ఎస్ ఎంపీల నినాదాలకు ప్రతి నినాదాలు చేశారు.

 ఎందుకీ డ్రామాలు.. రైతులు చస్తున్నా వడ్లు సేకరించారా.. మండిపడ్డ బండి సంజయ్

ఎందుకీ డ్రామాలు.. రైతులు చస్తున్నా వడ్లు సేకరించారా.. మండిపడ్డ బండి సంజయ్

గులాబీ ఎంపీలపై బీజేపి ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. లోక్ సభ సాక్షిగా ఎందుకీ డ్రామాలంటూ బీజేపి ఎంపీలు మండిపడ్డారు. యాసంగి పంట కొనబోమని మీకెవరు చెప్పారపి, రా రైస్ పక్కా కొంటామని గతంలో ఇప్పుడూ అదే స్పష్టం చేస్తున్నామని ఎంపీలు చెప్పుకొచ్చారు. వానా కాలం పంట ఎందుకు కొనడం లేదని అడుగుతుంటే యాసంగి పేరుతో ఈ డ్రామాలేందని తెలంగాణ ప్రభుత్వం పై ధ్వజమెత్తుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం వానకు తడుస్తూ మొలకలెత్తున్నా ఎందుకు కొనడం లేదని బీజేపి ఎంపీలు నిలదీస్తున్నారు.

 రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టం.. ధాన్యం సేకరించకుండా ఇదేం రాజకీయమన్న బీజేపి

రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టం.. ధాన్యం సేకరించకుండా ఇదేం రాజకీయమన్న బీజేపి

వరి కుప్పలపై రైతుల చస్తున్నామీ కళ్లకు కనబడం లేదా అని గులాబీ ఎంపీలను సూటిగా ప్రశ్నిస్తున్నారు బీజేపి ఎంపీలు. ఇంకెంత మంది రైతులను చంపుతారని నిలదీశారు. వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజను కొంటామని కేంద్ర మంత్రి చెబుతున్నా రైతుల నుండి ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. యాసంగిలోనూ రా రైస్ కొంటామని కేంద్రం ప్రకటించినా ఇంకా ఈ రాజకీయం చేయడమేందని, సమస్యను పక్కదారి పట్టించేందుకే టీఆర్ఎస్ ఎంపీలు ఈ డ్రామా చేస్తున్నారని బీజేపి ఎంపీలు ఘాటుగా విమర్శించారు.

 క్యాంటీన్లో ఫోటోలు.. పార్లమెంట్ లో దిగినట్టు బిల్డప్ ఎందుకన్న బండి సంజయ్

క్యాంటీన్లో ఫోటోలు.. పార్లమెంట్ లో దిగినట్టు బిల్డప్ ఎందుకన్న బండి సంజయ్

టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోని క్యాంటిన్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపిన ఫొటోలను పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్నట్లుగా గురువారం మీడియాలో ఫొటోలు ప్రచురితం కావడంపట్ల బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. సెంట్రల్ హాల్ క్యాంటిన్ లో ఫొటోలు దిగి పార్లమెంట్ లో నిరసన తెలిపినట్లు మీడియాకు ఫోజులివ్వడమా? సిగ్గుసిగ్గు అంటూ టీఆర్ఎస్ ఎంపీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లో ఎలా వ్యవహరించాలో తెలియదని, నిరసన ఎలా తెలపాలో కూడా తెలియని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఏదో పొడిచినట్టు తెలంగాణ ప్రజలకు కలరింగ్ ఇస్తుంటారని, తెలంగాణ ప్రజలు వీళ్ల వైఖరి ఎండగట్టాలని బీజేపి ఎంపీలు సూచించారు.

English summary
Bandi Sanjay was amazed when photos of TRS MPs protesting with placards at the canteen in the Central Hall of Parliament were published in the media on Thursday. Is it to take photos in the Central Hall canteen and pose to the media as a protest in Parliament? Eddewa addressed the TRS MPs saying it was a shame.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X