పుల్వామా దాడులకు మూడేళ్లు: సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ అనుమానాలు: సాక్ష్యాలున్నాయా?

హైదరాబాద్: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుల్వామా ఉగ్రవాద దాడులకు ఇవ్వాళ్టితో మూడు సంవత్సరాలు ముగిశాయి. 2019లో సరిగ్గా ఇదే రోజున జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర వద్ద జైషె మహ్మద్ ఉగ్రవాదులు మారణాయుధానికి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనాలపై ఆత్మాహూతి దాడికి పాల్పడ్డారు. ఈ నరమేధంలో 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం ఇవ్వాళ నివాళి అర్పిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుల్వామా ఉగ్రదాడిని గుర్తు చేసుకున్నారు. అమర జవాన్లకు నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. 2019లో జవాన్ల పార్థివ దేహాలకు శ్రద్ధాంజలి అర్పించినప్పటి ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. ఈ సందర్భంగా తమ సంతాపం తెలిపారు. అమర జవాన్లకు నివాళి అర్పించారు.

సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలు

సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలు

ఈ పరిణామాల మధ్య టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిర్వహించినట్లుగా చెబుతోన్న సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలను లేవనెత్తారు. దేశ సరిహద్దులకు అవతల, పాకిస్తాన్ భూభాగంపై బాలాకోట వద్ద గల జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన దాడులు కాకుండా- సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి గల సాక్ష్యాధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని యూరి సెక్టార్ వద్ద ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీకి మద్దతుగా..

రాహుల్ గాంధీకి మద్దతుగా..

ఈ విషయంలో ఆయన.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయనడానికి సాక్ష్యాధారాలను చూపించాలంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాను అదే విషయంపై ప్రశ్నిస్తున్నానని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయనడానికి కేంద్ర ప్రభుత్వం సాక్ష్యాధారాలను చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

దేశ ప్రజల్లోనూ అనుమానాలు..

సాక్ష్యాధారాలను బయట పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంపై దేశ ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అన్నారు. ప్రజలు సైతం సాక్ష్యాధారాలను బయటపెట్టాలని కోరుతున్నారని చెప్పారు. తామందరం ప్రజాస్వామ్య వ్యవస్థలో నివసిస్తున్నామని గుర్తు చేశారు.

మోడీ మోనార్క్ కాదు..

మోడీ మోనార్క్ కాదు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- మోనార్క్ కాదని విమర్శించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడని, ఓ లోక్‌సభ సభ్యుడిగా- సర్జికల్ స్ట్రైక్స్‌పై సాక్ష్యాధారాల గురించి ప్రశ్నించడంలో తప్పు లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలోనే సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు జరుగుతాయనే అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. కాగా- పుల్వామా దాడులు మూడేళ్లు పూర్తి చేసుకోవడానికి ఒక్క రోజు ముందు కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+