అల్లు అర్జున్ తీస్‌మార్ ఖాన్ అనుకుంటున్నాడా- తోలు మంచిగా ఉంచుకో
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్‌కు వెళ్లాననడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పూలేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్‌షో చేయలేదని, పోలీసుల డైరెక్షన్‌లోనే థియేటర్‌కు వెళ్లాననీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఏసీపీ విష్ణుమూర్తి ఘాటుగా స్పందించారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టి ఎలా మాట్లాడగలడని, తన తప్పేమీ లేదని ఎలా చెప్పగలడని ప్రశ్నించారు. పోలీసుల డైరెక్షన్‌లోనే వెళ్లాననడం సరికాదని, తమను బాధ్యులుగా చేస్తోన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు.
ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ పాలు తాగే పిల్లవాడేం కాదని, తప్పొప్పులు ఏమిటో చట్టం, రాజ్యాంగ పరిధి ఏమిటో అతనికి బాగా తెలుసుననే అనుకుంటున్నానని అన్నారు. దాని పరిధిని దాటి మాట్లాడకూడదని విష్ణుమూర్తి హితవు పలికారు.
తమకు బందోబస్తు కావాలంటూ ఓ తెల్ల పేపర్ మీద రాసి ఇస్తే సరిపోతుందా?, తమకు రూల్స్ ఉండవా? అని ఆయన నిలదీశారు. తాము మనుషులమేనని, ప్రజలను రక్షించే పనుల్లో నిమగ్నమై ఉన్న పోలీసుల మీద బడాబాబులు డబ్బు, మదంతో అవాకులు, చెవాకులు చెప్పి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్నారని మండిపడ్డారు. దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారని అన్నారు.
తొక్కిసలాట జరిగినట్లు పోలీసులెవరూ తనకు చెప్పలేదనడాన్ని విష్ణుమూర్తి తప్పుపట్టారు. ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా?.. ఆయన కూడా ఓ సామాన్య పౌరుడేనని అన్నారు. నీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు? ఆంధ్రాలో ఉందా? తెలంగాణలో ఉందా? అని నిలదీశారు.
తెలంగాణ అసెంబ్లీలో గంట పాటు అల్లు అర్జున్ గురించి చర్చించడం ఏమిటని, అత్యంత విలువైన ప్రజాధనం వృధా అయిందని అన్నారు. తెలంగాణ సమాజం ఎంతో మంచిదని, ఇక్కడి ప్రజలు సౌమ్యులు కాబట్టే ఆయన ఇంకా ఇక్కడ ఉండగలుగుతున్నారని, నాటకాలు ఇంకా సాగుతున్నాయని ధ్వజమెత్తారు. గరీబోళ్లయిన తెలంగాణ బిడ్డలు వేల రూపాయలు పెట్టి సినిమాలు ఎందుకు చూడాలని విష్ణుమూర్తి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications