క్యూ-నెట్ ఉద్యోగాల పేరిట రూ.3కోట్ల వసూళ్లు: మహిళతోపాటు అరెస్ట్
హైదరాబాద్: ఈ-కామర్స్ వ్యాపారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలను కాజేసిన ముఠాలోని కీలక నిందితుల్ని సీసీఎస్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళా నిందితురాలు కూడా ఉంది. కాగా, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

నిందితుడు
హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీనాథ్ కొండ(39), ప్రసన్నకుమార్‌రెడ్డి(35), కాంచన ఒబ్బిలిచెట్టి(33), బీమర్తి ధన్‌రాజ్(36) ముఠాగా ఏర్పడి ఉద్యోగాలిప్పిస్తామని ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు.

ఉద్యోగాల పేరుతో మోసం
వీరు హాంకాంగ్ కేంద్రంగా గల క్యూనెట్ లిమిటెడ్ సంస్థ వెబ్‌సైట్‌లో సొంతంగా రిజిస్టర్డ్ ఐడీలను కలిగి ఉన్నారు. వీటి ఆధారంగా సెమినార్లు నిర్వహిస్తూ నిరుద్యోగులను ఆకర్షించారు.

రూ. కోట్ల వసూళ్లు
ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించడంతోపాటు ఉద్యోగాలు లభిస్తాయంటూ నమ్మించారు. సుమారు 200 మంది నుంచి రూ.2-3 కోట్ల వరకు వసూలు చేసి ఉద్యోగాలడిగితే మొహం చాటేస్తున్నారు.

ముఠాలో మహిళా సభ్యురాలు
వసూలు చేసిన డబ్బుతో విదేశాల్లో పర్యటించి జల్సా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులోని మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications