వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు : బహిరంగ సభ - పార్టీ నేతలతో : ఇక తేల్చేస్తారా..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ పైన పార్టీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయటం.. తమదే అధికారం అంటూ బీజేపీ ప్రచారం నడుమ..కాంగ్రెస్ పార్టీ సైతం తమ బలం చాటుకొనేందుకు సిద్దమైంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు బాధ్యతలు అప్పగించిన తరువాత..పార్టీలో జరుగుతున్న పరిణామాల పైన హైకమాండ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. తాజాగా , తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి పోరు పెరగటంతో..ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించి వారికి పార్టీ నేత రాహుల్ దిశా నిర్దేశం చేసారు.

రాహుల్ పర్యటనతో కార్యాచరణ మొదలు

రాహుల్ పర్యటనతో కార్యాచరణ మొదలు

అదే సమయంలో పార్టీ కి రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసారు. సునీల్ కనుకోలు పార్టీ కోసం పని చేస్తారని ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రంలో పర్యటించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ ను కోరారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే..తాను తెలంగాణలో పర్యటనకు ఎప్పుడూ సిద్దమేనని రాహుల్ స్పష్టం చేసారు. అందులో భాగంగా..తాజాగా తెలంగాణలో రాహుల్ పర్యటన అధికారికంగా ఖరారైంది. మే 4, 5 తేదీల్లో రాహుల్ పర్యటన ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి పీసీసీకి సమాచారం అందింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మే 4న వరంగల్ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసారు.
ఆ సభలో రాహుల్ కీలక ప్రసంగం చేయనున్నారు.

పార్టీ నేతలు స్పష్టమైన హెచ్చరికల ద్వారా

పార్టీ నేతలు స్పష్టమైన హెచ్చరికల ద్వారా

కేసీఆర్ పాలన.. బీజేపీ నేతల తీరు...తెలంగాణ రాష్ట్రం - కేంద్ర మధ్య వివాదాల పైన రాహుల్ స్పందించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ - బీజేపీ - ఎంఐఎం టార్గెట్ గా రాహుల్ ప్రసంగం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మే 5వ తేదీన బోయిన్ పల్లిలో పార్టీ అనుబంధ విభాగాల నేతలు..ముఖ్య కార్యకర్తలతో రాహుల్ సమావేశం కానున్నారు. ఇక, తెలంగాణలో పార్టీ నేతల మధ్య అనైక్యత..అసమ్మతి పైన రాహుల్ గట్టి సందేశం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఏఐసీసీ నేతల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

ఇక తరచూ రాహుల్ పర్యటనలు

ఇక తరచూ రాహుల్ పర్యటనలు

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ నేతలు..ఐక్యంగా ముందుకు సాగితే అధికారం దక్కుతుందని అంచనాల్లో ఉన్నారు. దీంతో..పార్టీ నేతలకు రాహుల్ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. దీంతో..పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాకూర్ రేపు (శుక్రవారం) హైదరాబాద్ రానున్నారు. రాహుల్ పర్యటనతో పాటుగా.. సంస్థాగతంగా పార్టీ సభ్యత్వం... సభ నిర్వహణ పైన చర్చించి.. దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో..రాహుల్ పర్యటనతో పార్టీలో జోష్ పెరుగుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.


English summary
Congress MP Rahul Gandhi is all set to tour Telangana and to fill in some energy to the congress cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X