వారికి రైల్వే శాఖ బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే!
ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లలోనూ, రైల్వే ప్లాట్ఫాముల మీద, రైల్వే ట్రాక్ ల మీద రీల్స్ చేయడం చాలా మంది పనిగా పెట్టుకున్నారు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ చేస్తున్నవారు రైల్వేను కూడా తమ రీల్స్ కోసం ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవాలని భావిస్తున్న వారు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడమే కాకుండా రైల్వే ప్రయాణికులకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు.
భారతీయ రైల్వే సంచలన నిర్ణయం
భారత రైల్వే వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. ఇక ఇలాంటి వారి విషయంలో భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారిని, ట్రాక్ ల వద్ద రీల్స్ చేస్తూ ప్రాణం మీదికి తెచ్చుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

రాజస్థాన్ రాష్ట్రంలో ట్రాక్ పై రీల్స్ ఘటన
రైలు పట్టాల పైన ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఓ థార్ వాహనంతో రీల్స్ చేయడం కోసం వెళ్లగా సడన్ గా ఒక గూడ్స్ రైలు రావడం థార్ ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోవడం, సదరు రైలు లోక పైలెట్ ట్రాక్ పై వాహనాన్ని చూసి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఆ వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల పాలు చేశారు.
కఠిన నిర్ణయం తీసుకున్న రైల్వే
ఇక ఈ క్రమంలోనే తాజాగా రైల్వే కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే రైళ్లలో కానీ, రైలు పట్టాలపై కానీ, ఎక్కడైనా సరే రీల్స్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేసులు పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారి పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని దేశంలోని అన్ని జోన్లకు రైల్వే తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఇక అలా చేస్తే కటాకటాల పాలే
రైల్వే శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూల్స్ అతిక్రమిస్తూ రీల్స్ చేస్తున్న వారిపైన కఠినంగా వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జి ఆర్ పి పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్టు తెలుస్తోంది. ఏమైనా ఇకనుంచి రైళ్లలో, రైల్వే ప్లాట్ఫామ్ ల మీద, రైల్వే ట్రాక్ ల మీద వీడియోలు చేస్తూ హంగామా చేయాలనుకుంటే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే.












Click it and Unblock the Notifications