పండుగ రద్దీ వేళ ఈ ప్రధాన మార్గంలో ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
వినాయక చవితి.. వరుస సెలవుల వేళ రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే ముఖ్య మైన రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్ల ను ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ప్రధాన మార్గంలో నాలుగు జనసాధారణ్ రైళ్లను అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు కొనసాగే మార్గంతో పాటుగా హాల్టింగ్ స్టేషన్లు... టైమింగ్స్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించింది.
వినాయక చవితి.. వరుస సెలవులతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో 4 జనసాధారణ్ (అన్‌రిజర్వ్‌డ్) ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 12, 13 తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు 07235 ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి, ఇవే రోజుల్లో 07236 ప్రత్యేకరైలు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 6గంటలకు బయల్దేరుతాయని వెల్లడించారు. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ బోగీలు మాత్రమే ఉంటాయి. సాధారణ, పేద ప్రయాణికులకు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉపయోగపడనున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 12, 13 ఈ రెండు తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:10 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుందని అధికారులు వివరించారు.

రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు
కాగా.. ఈ జనసాధారణ్ ప్రత్యేక రైలు చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ ట్రైన్ 2026 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆయా తేదీల్లో రాత్రి 11 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్(నాంపల్లి) చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఆసిఫాబాద్ రోడ్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, జనగాం, భువనగిరి, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపారు. కాగా.. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వీటి కొనసాగింపు పైన నిర్ణయం ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications
