Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rain alert: ఈ జిల్లాల్లో వడగండ్ల వానలు

హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లయింది.

తాజాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Rains in these districts of Telangana including Hyderabad

హైదరాబాద్ మహా నగరంతోపాటు చుట్టు పక్కల జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లా యాచారం, మహేశ్వరం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పల్‌లో వడగళ్ల వాన కురుస్తుందని పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కాగా, శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురిసింది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, ప్రగతిగనర్, బాచుపల్లి, మూసాపేట, ఎస్ఆర్‌నగర్, మధురానగర్, బోరబండ, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

శుక్రవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని చాలా చోట్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.

నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం కురిసింది. దర్పల్లిలోని వాడి గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో వరిధాన్యం నేలరాలింది. కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి.

మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఆ ఇంట్లోని సామాగ్రి ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షం పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+