సెంట్రల్ జైల్లో రాజయ్య: బూతులు తిట్టారు, మహిళతో సంబంధంపై నిలదీశా.. 'షాహిన్'కు సారిక
వరంగల్: సారిస, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో ఆమె మామ, మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మామునూరు పోలీసులు వారిని గురువారం రాత్రి ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించార. అనంతరం హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టు ఇంఛార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టారు. రిమాండ్ విధించడంతో వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
లేఖలు, మెయిల్స్ పెట్టిన సారిక
ఓ స్వచ్ఛంద సంస్థకు, తన తరఫు న్యాయవాదికి తన బాధలను సారిక లేఖలు, మెయిల్స్ ద్వారా తెలిపారు. తననూ, పిల్లలనూ పస్తులు ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మహిళపై మోజుతో అనిల్ తనను పట్టించుకోలేదని వాపోయారు. లేఖల్లో, మెయిల్స్‌లో ఆమె ఎన్నో సమస్యలు చెప్పుకున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అత్తమామలు తనకు నరకం చూపించారని పలు సందర్భాల్లో చెప్పారు. తనకు ఏదైనా జరిగితే భర్త, అత్తమామలదే బాధ్యతని పేర్కొన్నారు. తన వేదనను పాతబస్తీలోని షాహిన్ మహిళా సేవా సంస్థకు లిఖితపూర్వకంగా, తన తరఫు న్యాయవాది రెహానాకు మెయిల్ ద్వారా వేర్వేరు సందర్భాల్లో పంపారు.
వాటిలో... ఇంట్లోంచి వచ్చేయాలని, నేను పెళ్లి చేస్తానంటూ అత్త మాధవి ప్రోత్సహించిందని, పెళ్లయ్యాక బూతులు తిట్టిందని, చేయి చేసుకుని ఇంట్లోంచి గంటేసిందని, మామ రాజయ్య పైకి మంచిగా మాట్లాడేవాడని, మనం కూర్చుని మాట్లాడుకుందాం అనేవాడని, తర్వాత కుట్రలు పన్నేవాడన్నారు.

తొలి సంతానం కలిగాక రెండేళ్లు నన్ను పట్టించుకోలేదని, తర్వాత తన కుమారుణ్ని బలవంతంగా తీసుకెళ్లారని, దీంతో నాలుగేళ్ల క్రితం మా అత్తారింటికి రెండోసారి వెళ్లానని, రెండోసారి గర్భం దాల్చాక చిత్రహింసలు పెరిగాయన్నారు. అనిల్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
చిత్రహింసలు భరించలేక ఒక్కోసారి జీవితం చాలించాలనిపిస్తోందని, తనకు ఏదైనా అయితే మా అత్తమామలు, అనిల్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. పెళ్త్లెన తర్వాత 2006 ద్వితీయార్థం నుంచి ఉద్యోగరీత్యా రెండేళ్లపాటు కోల్‌కతా, ముంబయి, పుణెల్లో ఉన్నామని చెప్పారు.
2008 నవంబరులో బాబు పుట్టడంతో హైదరాబాద్‌కు తిరిగొచ్చామని, హైదరాబాద్ వచ్చాక అనిల్ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేవాడని, పిల్లాడి ఆలనాపాలనా చూసుకునేవాడు కాదన్నారు. 2010లో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గట్టిగా నిలదీశానని పేర్కొన్నారు.
మధ్యలో కొన్నిరోజుల వరంగల్‌కు వెళితే అత్తామామలు నన్ను చిత్రహింసలు పెట్టి ఇంట్లోంచి గెంటేశారన్నారు. దీంతో బాబును తీసుకుని ఉద్యోగం కోసం మళ్లీ పుణె వెళ్లానని, కొద్దిరోజులకు అక్కణ్నుంచి వచ్చేసి కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో ఉన్నానని చెప్పారు.
అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, అనిల్‌తో తెగతెంపులు చేసుకున్నట్లే అనుకుంటుండగా ఓ రోజు మా అత్త వచ్చిందని, తాను ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయిందన్నారు.
దీంతో మా అమ్మానాన్నలు ఆలోచించి పెద్దమనుషులతో మాట్లాడి వరంగల్‌లో దిగబెట్టి వస్తామని చెప్పారని పేర్కొన్నారు. కాగా, 2011 ఏప్రిల్ 16న స్వచ్ఛంద సేవా సంస్థకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2011 ఏప్రిల్ 23న వరంగల్‌కు వెళ్లారు. ఆ తర్వాత వేధింపులు మళ్లీ మొదలయ్యాయని చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications