• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడు రాజీవ్ గాంధీ వర్థంతి..!అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలన్న టీపిసిసి నేతలు..!!

|

హైదరాబాద్ : మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నింళులు అర్పించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమానికి కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే నని గుర్తు చేసారు. ఇక దేశంలో ని బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన కృషి ఎప్పటికి మనవలేమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు.

 రాజీవ్ గాందీ 29వ వర్ధంతి...

రాజీవ్ గాందీ 29వ వర్ధంతి...

అంతే కాకుండా భారతదేశానికి ఒక దిక్సూచిగా గాంధీ కుటుంబ సంభ్యులు నిలిచారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాందీకే దక్కుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని దేశానికి పరిచయం ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకులనేలా చేసింది కూడా రాజీవ్ గాంధీ నేనని చెప్పుకొచ్చారు. దేశ యువతను సాంకేతిక రంగం వైపు మళ్ళించమే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖ కంపెనీలకు భారతీయులనే సీఈవోలుగా ప్రాతినిధ్యం వహించే స్తాయికి దేశానని ముందకు నడిపించారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

దేశానికి సాంకేతికతను తీసుకోచ్చింది రాజీవ్ గంధీనే..

దేశానికి సాంకేతికతను తీసుకోచ్చింది రాజీవ్ గంధీనే..

అంతే కాకుండా సాంకేతికంగా దేశాన్ని అభివృద్ధి పథ వైపు నడిపిన ఘనత రాజీవ్ గాంధీదే నని, దేశ సమైక్యత కోసం ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలపడానికి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కృషి చేశారని అన్నారు రేవంత్ రెడ్డి. దేశ సంక్షేమం కోసం, అభివృద్దికోసం ఆఖరు రక్తపు బొట్టు వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్వం చేసారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్బంగా సోమాజి గూడ లోని రాజీవ్ గాంది విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు మల్కాజిగిరి ఎంపి,వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి.

రాజీవ్ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలి..

రాజీవ్ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలి..

అంతే కాకుండా స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రపంచ శాంతి కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు ఉత్తమ్. రాజీవ్ హత్య జరిగిన మే 21న అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని భారత ప్రభుత్వానికి ప్రతిజ్ఞ చేశారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని, ఐటీ రంగంలో నేడు ఇండియా అగ్రగామి గా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమే నని అన్నారు.

  Telangana, Andhra Likely To Experience Heatwave Conditions: IMD
  దేశం కోసం త్యాగం చేసింది గాంధీ కుంటుంబమే..

  దేశం కోసం త్యాగం చేసింది గాంధీ కుంటుంబమే..

  ఇదిలా ఉండగా సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎంపీ వి. హనుమంత రావ్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు రాజీవ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ కుంటుంబ సభ్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాభివృద్దికి పాటు పడతారని, అంతటి అంకిత భావం ఏ రాజకీయ పార్టీ నేతలకు ఉండదని వి. హనుమంతరావు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని వీహెచ్ తెలిపారు. మొత్తానికి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలందరూ ఒకే వేదికపై కనిపించడం పట్ల ఆపార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  On the occasion of the death of former Prime Minister and Heavenly Rajiv Gandhi, Telangana Congress leaders greeted with gratitude. Congress chief Uttam Kumar Reddy along with Malkajgiri MP Rewant Reddy participated in the Vardhanthi program organized by Gandhibhavan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more