హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైడింగంటే ఇష్టం, ప్రయాణం సాఫీగా సాగాలంటే..: రకుల్‌ప్రీత్ సింగ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని రోడ్లపై వాహనం నడపడమంటే తనకెంతో ఇష్టమని టాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించినప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు.

అనంతరం అడిషనల్‌ ట్రాఫిక్‌ సీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోందని అందులో భాగంగా పోలీస్‌శాఖ తనవంతు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రకుల్‌.. బైక్‌ను హెల్మెట్‌ ధరించి ట్రాఫిక్‌ ఇనిస్టిట్యూట్‌లో చక్కర్లు కొట్టారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అధికారులు ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) జితేందర్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ- 2 ఏవీ రంగనాథ్, అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ల ఎం.శ్రీనివాసులు, కె.శ్రీనివాస్, పీజీ రెడ్డి, అమర్ కాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ నగరంలోని రోడ్లపై వాహనం నడపడమంటే తనకెంతో ఇష్టమని టాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా రకుల్‌.. బైక్‌ను హెల్మెట్‌ ధరించి ట్రాఫిక్‌ ఇనిస్టిట్యూట్‌లో చక్కర్లు కొట్టారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అధికారులు ఆమెను సత్కరించారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించినప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు.

English summary
Hyderabad Traffic Police on Tuesday invited Tollywood actress Rakul Preeth Singh to Traffic Training Institute (TTI) in Goshamahal to make motorcyclists realise the need to wear helmets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X