మెగా కోడలు ఉపాసన పుట్టింట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రామ్ చరణ్ భార్య!!
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని పుట్టింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాసన నానమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన ఉపాసన తన నానమ్మ పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు.
నానమ్మ మృతితో ఉపాసన ఎమోషనల్ పోస్ట్
తన నానమ్మతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్న ఉపాసన, తన నానమ్మ దగ్గర తాను ఎన్నో నేర్చుకున్నాను అన్నారు. చివరి వరకు ఆమె ఎంతో కృతజ్ఞతా, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారని ఉపాసన తన నానమ్మ గురించి తాను పెట్టిన పోస్టులో చెప్పుకొచ్చారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నానమ్మ ద్వారానే తెలుసుకున్నానని పేర్కొన్న ఉపాసన, తనను పెంచింది ఆమెనేనంటూ ఎమోషనల్ అయ్యారు. తన గ్రాండ్ పేరెంట్స్ ద్వారా తాను అందుకున్న ప్రేమానుభవాలను, నేను నా పిల్లలకు కూడా అందేలా చేస్తానని మాటిస్తున్నా అంటూ ఉపాసన ఎమోషనల్ మెసేజ్ పెట్టారు.

పిల్లలు పుడతారన్న సంతోషంలో ఉండగానే ఉపాసన పుట్టింట విషాదం
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఉపాసన కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పిల్లల విషయంలో ఉపాసన, రాంచరణ్ గుడ్ న్యూస్ చెప్పారు. అప్పటినుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అంతా శుభమే జరుగుతుంది అని భావిస్తున్న వేళ ఉపాసన నానమ్మ పుష్నాని ఈ విధంగా మృతి చెందడం ప్రస్తుతం ఉపాసనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. తన తాత, నానమ్మల వద్ద పొందిన ప్రేమ అనుభవాలను తాను తన పిల్లలకు అందేలా చూస్తానని వాగ్దానం చేసిన ఉపాసన ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తన నానమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఉపాసన పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు
ఇక ఉపాసన పోస్టు చూసిన నెటిజెన్లు స్పందిస్తున్నారు. పలువురు ఉపాసనకు తమ సంతాపాన్ని, ఉపాసన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఉపాసన పోస్టు చదివిన చాలా మంది.. పెద్దవారిపట్ల ఉపాసనకు ఉన్న ప్రేమకు, ఆమె చేసిన వాగ్దానానికి ఆమెను మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో గొప్ప తల్లివి అవుతావు అంటూ ఉపాసనను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదే సమయంలో ఉపాసన నానమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications