ప్రథమ పౌరుడి ప్రధాన కర్తవ్యం..! క్లిష్ట సమయంలో పేదలకు అండగా నిలుస్తున్న నగర మేయర్ రామ్మోహన్..!!
హైదరాబాద్ : సర్వం బంద్.. సకలం బంద్.. జనజీవన స్రవంతి బంద్.. దేశం అతి క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ ను తరిమికొట్టే క్రమంలో దేశం మొత్తం లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎక్కడి వారు అక్కడే కాలం వెళ్ల దీస్తున్నారు. ఇదే క్రమంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు, వలస కూలీలు, దినసరి వేతన కార్మికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు రాయితీలను అందిస్తోంది. అయినప్పటికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను పొందే అవకాశం లేని నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అలాంటి వారిని ఆదుకుని తక్షణ సాయం అందించేందుకు ప్రతిరోజూ తన వంతు కృషి చేస్తున్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్..!

నగర ప్రథమ పౌరిడి కీలక పాత్ర..
దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఇదే క్రమంలో జీవనోపాది కోల్పోయిన కొంత మంది నిరుపేదలు దుర్బర పరిస్ధితులను ఎదర్కొంటున్నట్టు తెలుస్తోంది. చేతిలో డబ్బులు లేక, వంట చేసుకునేందుకు తిండిగింజలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కాలనీల పక్కన ఉన్న మురికి వాడల్లోని పేదల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నట్టు సమాచారం. బయటకు వచ్చే పరిస్థితులు లేక, జీవన బృతి లేక, ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం లేక నిరుపేదలు కొందరు సతమతమవుతున్నట్టు స్పష్టమవుతోంది.

మురికి వాడల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మేయర్..
సరిగ్గా ఇలాంటి సంఘటనల సమాచారం తెలుసుకున్న నగర మేయర్ చలించిపోతున్నట్టు తెలుస్తోంది. ఆకలి బాదతో అలమటించి పోతున్న నిరుపేదల వద్దకు క్షణాల్లో వాలిపోతున్నారు. ఆకలితో బాధ పడుతున్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. రేషన్ కార్డులు లేని వారికి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ వారికి తక్షణ రేషన్ కార్డులు అందేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తరుపున అందే బియ్యం, ఆర్ధిక సాయం పొందేందుకు క్షేత్ర స్దాయిలో చర్యలు తీసుకుంటున్నారు మేయర్ బొంతు రామ్మోహన్.

నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు..
కరోనా మహామ్మారి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే వారికి ఉచితంగా సానిటైజర్లతో పాటు నిత్యావసర సరుకులను దగ్గరుండి పంపిణీ చేస్తున్నారు నగర ప్రథమ పౌరుడు. అంతే కాకుండా మంత్రులతో సమీక్షా సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిశానిర్దేశాలను క్షేత్ర స్దాయిలో అమలు చేస్తున్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ముఖ్యంగా వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేయర్ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రవాణ వ్యవస్ధ పూర్తిగా స్తంభించిపోయిన తరుణంలో వలస కార్మికులు కాలినడకన స్వస్దలాలకు పయనమైన ఉదంతం పట్ల మేయర్ తక్షణం స్పందించారు.
Recommended Video

వలస కూలీలకు కొండంత అండ..
హైదరాబాద్ నగరం నుండి శ్రీకాకుళం వెళ్లేందుకు పిల్లా పాపలతో కాలి నడకన పయనమైన దాదాపు మూడు కుంటుంబాలను మేయర్ రామ్మోహన్ అక్కున చేర్చుకున్నారు. సుమారు తొమ్మిది వందల కిలో మీటర్ల కాలి నడక ప్రస్తుత సమయంలో అసంభవమని వారికి సర్థి చెప్పారు మేయర్. స్ధానిక పాఠశాలలో వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసారు మేయర్. లాక్ డౌన్ ఆంక్షలు ముగిసే వరకు వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలే కాకుండా మురికి వాడల్లోని నిరు పేదల పట్ల స్పందింస్తున్న తీరుపట్ల మేయర్ రాంమోహన్ కు అన్ని వార్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications