షాకింగ్: ప్రియుడి మోజులో పడి ఎంతో ప్రేమగా పెంచిన తల్లినే కడతేర్చింది
హైదరాబాద్: ప్రియుడి మోజులో పడిన ఓ యువతి తనను పెంచి పెద్ద చేసిన తల్లిని దారుణంగా హతమార్చింది. ఎంతో ప్రేమగా పెంచుకున్నా.. ఏ మాత్రం కనికరం లేకుండా ప్రాణాలు తీసింది. అంతేగాక, మృతదేహాన్ని ఊరికి దూరంగా పడేసి.. ఏమీ ఎరగనట్లు నటించింది. అయితే, మృతురాలు అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. అసలైన నిందితురాలిని కటకటాల వెనక్కినెట్టారు.

ఆస్తి ఇవ్వలేదనే కోపంతో..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గండిపేట మండలం కిస్మత్‌పూర్‌లో విదేశీయురాలైన క్రిస్టియానా.. మెరికా అనే పేరుతో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసి సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, మరో ఇద్దరు అనాథలను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేశారు. వీరిలో ఒకరైన రోమా అనే యువతి కొన్ని రోజుల క్రితం ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెను పెంచిన తల్లి క్రిస్టియానా దూరం పెట్టింది. అయితే, తనకు ఆస్తిలో వాటా కావాలని కొద్ది రోజులుగా భర్తతో కలిసి రోమా.. క్రిస్టియానాను వేధిస్తోంది. కాగా, ఆస్తి పంచేందుకు మేరీ క్రిస్టియానా ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైన ఆమెను అంతమొందించాలని కుట్ర పన్నింది రోమా.

కన్నతల్లిని చంపి.. చెరువులో పడేశారు
రెండు రోజుల క్రితం రోమా, ఆమె భర్త కలిసి మేరీ క్రిస్టియానాను గొంతునులిమి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో వేసి కారులో తీసుకెళ్లి హిమాయత్‌సాగర్ చెరువులో పడేశారు. అదే రోజు సాయంత్రం క్రిస్టియానాకు ఆమె పెద్ద కుమార్తె ఫోన్ చేయగా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, రోమాపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రోమాను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు రోమా పోలీసుల ముందు అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా హిమాయత్ సాగర్ కట్టకు కొట్టుకువచ్చిన క్రిస్టియానా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మేరి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

యువకుడి వేధింపులు తాళలేక 10వ తరగతి బాలిక ఆత్మహత్య
ఇది ఇలావుండగా, ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో ఓ యువకుడి వేధింపులు తాళలేక సెప్టెంబర్ 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానంటూ బాధిత బాలికను ఓ యువకుడు వేధిస్తున్నాడు. సెప్టెంబర్ 9న కూడా ప్రేమించాలంటూ వేధించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చుట్టుపక్కలవారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో.. వెంటనే బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి బాలిక మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యుల ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలిక బలవన్మరణానికి కారణమైన యువకుడు సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications