హద్దులు దాటిన ప్రేమ: బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థులే తల్లిదండ్రులకు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రుల మాట కంటే వారు నమ్మిన బాటలోనే తప్పు, ఒప్పు అని కూడా చూడకుండా ముందుకెళ్తున్నారు. ఏదైనా జరిగిన తర్వాత కానీ, వారు చేసిన తప్పు తెలుసుకోవడం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా నగరంలో చోటు చేసుకుంది.

ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అల్వాల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే 17 సంవత్సరాల యువతి, యువకుడు ఓ విద్యాసంస్థలో ఇంటర్‌ చదువుకుంటూ ప్రేమలో పడ్డారు. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకొన్నారు. ఈ క్రమంలో యువతి ఫిబ్రవరి 14న పురిటి నొప్పులతో గాంధీ ఆసుపత్రిలో చేరింది.

Rape case filed on a youth, who raped a intermediate girl student

అక్కడ సదరు యువతి బిడ్డకు జన్మనివ్వడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్‌ కేసుగా పరిగణించి అల్వాల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడే వివాదం మలుపు తిరిగింది. పెద్దలు జోక్యం చేసుకొని విషయాన్ని గుట్టుగా దాచేందుకు ప్రయత్నించారు.

కాగా, పెళ్లికి యువతి తరఫు వారు పట్టుబట్టారు. ఇద్దరు మైనర్లు కావడంతో పెళ్లికి వయస్సు అడ్డువచ్చింది. మైనారిటీ తీరిన తర్వాత తర్వాత పెళ్లి చేయిస్తామని పెద్దలు ఒప్పందం చేయించారు. చిన్నారిని ఓ శిశుసదనంలో చేర్పించారు.

ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించకపోవడంతో వారూ జోక్యం చేసుకోలేదు. యువకుడు నగరంలోని ఓ కీలక ప్రజాప్రతినిధికి అనుచరుడు కావడం గమనార్హం. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం విషయం బహిర్గతమైంది.

మరోవైపు విషయం బయటికి చెప్పకుండా యువతి కుటుంబాన్ని యువకుడి వర్గం బెదిరిస్తోందనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌సీ కేసు నమోదు చేయని పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం కేసు నమోదు చేశారు. ఒప్పందంపై అనుమానాలు ఉండటంతో నిందిత యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్‌ సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rape case filed on a youth, who raped a intermediate girl student in Hyderabad on Wednesday.
Please Wait while comments are loading...