మరో యూట్యూబర్‌పై రేప్ కేస్ నమోదు...లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు..
యూట్యూబ్ స్టార్, ఫోక్ సింగర్ మల్లిక్‌తేజ్‌పై అత్యాచార కేసు నమోదయ్యింది. మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మాయ మాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తరచు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు. దీంతో జగిత్యాల పోలీసులు మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రక్రియ చేపట్టారు. ఇటీవలే ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపైనా రేప్ కేస్ నమోదయిన సంగతి తెలిసిందే.

సెలబ్రిటీలపై లైంగిక దాడులు..
మల్లిక్ తేజ్ రైటర్ కమ్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అతడి పాటలకు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ ను కూడా కలిగి ఉన్నాడు. మల్లిక్ తేజ్ యూట్యూబ్ ఛానల్స్ లో ఫోక్ సాంగ్స్ చేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి నమ్మించి అత్యాచారం చేశాడని, తనను ఎమోనషల్‌గా బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సదరు యువతి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.
ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు యూట్యూబర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సెలబ్రెటీలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవ్వడం చూస్తునే ఉన్నాం. ఇప్పటికే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అలాగే, ప్రముఖ ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications