రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎమ్మెల్సీ కవిత స్పందన!!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న బ్లాక్ కలర్ డ్రెస్ లో, ఒక అసభ్య ఎక్స్ పోజింగ్ తో లిఫ్ట్ లో వెళుతున్నట్టు ఒక ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో ఫేక్ వీడియో అని పలువురు అభ్యంతరం వ్యక్తం చెయ్యటంతో కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది.
ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. కాగా ఈ వీడియో వివాదం పై స్పందించిన కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ను వినియోగించే డిజిటల్ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఒకపక్క బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆన్లైన్లో అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్న మానిప్యులేషన్ కు ఇది ఒక హెచ్చరిక వంటిదని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ మహిళలను సైబర్ బెదిరింపుల నుండి రక్షించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనికోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఇక ఈ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు, రాజీవ్ చంద్రశేఖర్ కి కూడా ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. సుదీర్ఘ ప్రసంగాలు తర్వాత కాంక్రీట్ చర్యలు కావాలంటే కేంద్ర సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత ఈ వ్యవహారంలో చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications