Ration Card Ekyc: రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 31 చివరి తేదీగా ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు కేవైసీపై కొత్త అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో దాదాపు 70 శాతం పూర్తి అయిందని అధికారులు చెప్పారు.
ఈకేవైసీలో మేడ్చల్ మాల్కజిగిరి జిల్లా 87.8 శాతంతో టాప్ లో ఉంది. ఇంకా ఎవరైనా చేయనివారుంటే జనవరి 31లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గురించిన కేంద్రం ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని కోరుతోంది.

మరి కొంత మంది ఆడ వారు పెళ్లై అంతారింటికి వెళ్లారు. వారి పేరు కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ చేయడం వల్ల బతికున్న వారే ఈకేవైసీ చేసుకుంటారు. ఈకేవైసీ చేసుకోని వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు.












Click it and Unblock the Notifications