Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెత్తందారుల పోకడతో మావోయిస్టులుగా మారిన గాజర్ల రవి సోదరులు

జయశంకర్ భూపాలపల్లి :గాజర్ల రవి అలియాస్ ఉదయ్ సోదరులు కూడ మావోయిస్టు ఉద్యమంతో సంబందాలున్నాయి.ఈ కుటుంబంలోని ముగ్గురు సోదరులు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. గాజర్ల కుటంబంలోని ముగ్గురు కూడ పోరుబాట పట్టారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని వెలిశాల గ్రామానికి చెందిన రవి అలియాస్ గణేష్, ఆయన సోదరుడు ఆజాద్ అలియాస్ ఐతు అలియాస్ ఆశోక్ లు మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగారు.

అప్పటి పీపుల్స్ వార్ పార్టీ. నేటి మావోయిస్టు పార్టీలో ఈ కుటుంబం కీలకంగా వ్యవహారించడానికి గ్రామంలోని పెత్తందారీ వ్యవస్థే కారణమైంది.గాజర్ల మల్లయయ్, కనకమ్మ దంపతులకు రాయ్య, సమ్మయ్య సారయ్య,రవి, ఆశోక్ లు సంతానం. వీరిలో సారయ్య,రవి, ఆశోక్ లు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం తో పాటు గీత వృత్తిని చేస్తూ జీవనం సాగించేది కుటుంబం.1987 లో జరిగిన సింగిల్ విండ్ ఎన్నికల్లో ఆజాద్ డైరెక్టర్ పదవి కోసం పోటీచేశారు. అయితే తన ప్రత్యర్థి నల్ల కృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాదించారు. కృష్ణారెడ్డి విజయానికి అప్రజాస్వామ్యంగా వ్యవహరిచండమే కారణమని ఆజాద్ భావించారు.1989 లో పీపుల్స్ వార్ లో చేరారు. ఆ తర్వాత 1992 లో గణేష్ కూడ పీపుల్స్ వార్ లో చేరారు.1994 లో ఆశోక్ కూడ సోదరుల బాటలోనే నడిచాడు.

ravi brothers also maoist leaders

పీపుల్స్ వార్ పార్టీలో చేరకముందే గాజర్ల తల్లిడండ్రులు మరణించారు. పెద్ద సోదరుడు రాజయ్య అనారోగ్యంతో మరణించారు. సమ్మయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యారు. ఆజాద్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా , మిలటరీ ప్లాటూన్ కమాండర్ గా పనిచేశారు.2008 ఏప్రిల్ 2న, ఏటూరునాగారం మండలం కంతనపల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు.ఈ ఎన్ కౌంటర్ లో ఆయన భార్య రమ కూడ మరణించింది.ఈ ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ సాగుతోంది.

వీరికి వరుసకు సోదరుడయ్యే గాజర్ల నవీన్ కూడ మావోయిస్టు పార్టీలో పనిచేశాడు.నేర్లవాగు ఎన్ కౌంటర్ లో ఆయన చనిపోయాడు.దండకారణ్య ప్రత్యేక జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆశోక్ అనారోగ్యంతో భాడపడుతూ ఇటీవలే పోలీసులకు లొంగిపోయాడు. గణేష్ ఓడిశా ఎన్ కౌంటర్ లో మరణించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+