వరంగల్లో పండిట్ రవిశంకర్
వరంగల్: ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, శాంతి దూత, ఆధ్యాత్మిక గరువు పరమపూజ్య పండిట్ రవిశంకర్ గురూజీ ఆదివారం వరంగల్ నగరంలో పర్యటించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందరద్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే వరంగల్ గొప్ప చారిత్రత్మక నగరమన్నారు. ఓరుగల్లు నగరంలో చెట్లు ఎక్కువగా పెంచాలని కోరారు. వరంగల్ నగరంలో త్వరలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. యూత్ ఎంపవర్ మెంటు సెంటర్ ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. సమాజంలో కుటుంబ సమస్యలు పెరిగి పోతున్నాయని,, బాదితులు వారిని కలిసి చర్చించటం ద్వారానే సమస్యలు తొలగిపోతాయని ఆయన తెలిపారు. దీని కోసం కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన నాటి నుండి ఎలాంటి మతపరమైన గొడవలు జరుగలేదన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నపుడే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications