ఇవన్నీ చంద్రబాబు కాక ఎవరు కట్టారో: హరీష్‌కు పూర్తి వివరాలతో రావుల లేఖ

హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పైన మంత్రి హరీష్ రావుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణకు చంద్రబాబు ఏం చేశారో వివరంగా రాశారు.

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వాస్తవాలను మీ దృష్టికి తీసుకు రాదలిచానని, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో మరో రూ.1000 కోట్లు ఖర్చు పెడితే పెండింగు ప్రాజెక్టులు పూర్తయి ఏడాదిలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని పేర్కొన్నారు.

టీడీపీ ప్రారంభించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాల్వలు పవర్ హౌస్‌లు, లిఫ్టులు, రిజర్వాయర్లు అన్నీ పూర్తయ్యాయని, హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే వాటి పైన దృష్టి పెట్టేవారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మరో పెండింగ్ ప్రాజెక్టు కాకూడదనే తమ ఉద్దేశ్యమని చెప్పారు.

చంద్రబాబు పైకి ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. హైదరాబాదుకు తాగునీరు కోసం కృష్ణా జలాలను యుద్ధప్రాతిపదికన మళ్లించిందని, శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ ద్వారా సాగునీరు అందించిందని, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

 Ravula open letter to Harish Rao on irrigation projects

బీమా, జూరాల వంటి ప్రాజెక్టుల ద్వారా పాలమూరు ప్రజలకు సాగు, తాగునీటి సౌకర్యం కల్పించింది టీడీపీ కాదా అన్నారు. రూ.4556 కోట్లు ఖర్చు చేసి తెలంగాణలో 18,68,817 ఎకరాలకు సాగునీరు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో రెండు లక్షళ ఎకరాలకు నీరు అందించామని, ఏడాది పాలనలో హరీష్, కెసిఆర్ సాగు, తాగునీటి రంగంలో చేసింది సున్నా కాదా అని నిలదీశారు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చింది టీఆర్ఎస్ కాదా అన్నారు.

జాతీయ ప్రాజెక్టుగా తెచ్చుకోవాల్సిన ప్రాణహిత - చేవెళ్లను అనవసర మార్పులతో జాప్యం చేయడానికి కారణమేమిటని ప్రశ్నించారు. మధ్యలో కాళేశ్వర్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది మీరే కాదా అన్నారు.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కోసం రూ.394 కోట్లు ఖర్చు చేసి కొత్తగా 80వేల ఎకరాలకు సాగునీరు కల్పించింది, రాజోలి బండ మళ్లింపు పథకం లింక్ కాల్వ నిర్మాణం కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసిందని, సంగంబండ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయల్ నిర్మాణం రూ.85 కోట్లతో చేపట్టింది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పారు.

కల్వకుర్తి ఎత్తిపోతల్లో భాగంగా గుడిపల్లి రిజర్వాయర్ నిర్మించిందని, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఎత్తిపోతల ఫథకాల పనులు ప్రారంభించింది తమ పార్టీయే అన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. కెసిఆర్ కుటుంబం ప్రజలను మోసం చేస్తే టీడీపీ సహించదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+