రాయలసీమ ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం: రైలు దిగి ప్రయాణికులు పరుగలు

Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్.. ఇందల్‌వాయ్ మండలం సిర్నాపల్లి వద్ద పట్టాలు తప్పింది.

అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, బీ1 ఏసీ బోగి ఒక్కటే పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అరకిలోమీటర్ వరకు ట్రాక్ ధ్వంసం అయ్యింది.

Rayalaseema express escapes from accident
Rayalaseema express escapes from accident

ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పలువురు ప్రయాణికులు వెంటనే రైలు దిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rayalaseema express escaped from a big accident at Sirnapally on Saturday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి