నల్గొండ కాంగ్రెస్ కు రెబల్స్ బెడద.. ఏడుపులు, ఆందోళనలు: అసలేం జరుగుతుందంటే!!
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ స్ధానాలపై పెద్ద కసరత్తే చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్న సాయంత్రం తరువాత అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మిర్యాలగూడ మినహా మిగిలిన రెండు స్ఠానాలలో అభ్యర్థుల ప్రకటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రధానంగా సూర్యాపేటలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ల మధ్య టిక్కెట్ కోసం బిగ్ ఫైట్ నడిచింది.. ఇందులో పిసిసి అద్యక్షుడుడ రేవంత్ రెడ్డి వర్గంగా పేరున్న పటేల్ రమేష్ రెడ్డికే టిక్కెట్ వస్తుందని అంతా భావించారు. అదే సమయంలో సీనియర్ దామోదర్ రెడ్డి కూడా పట్టువదలని విక్రమార్కుడిలా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు.

దీంతో చాలా రోజులుగా పెండింగ్ లో ఉంచిన ఈ స్ధానానికి అనూహ్యంగా సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ప్రకటించారు. దీంతో టిక్కెట్ ఆశించి భంగపడిన మరో నేత పటేల్ రమేష్ రెడ్డి, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. టిక్కెట్ రానందుకు నిరసనగా నిన్న రాత్రి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు.
ఈ సందర్భంగా రమేష్ రెడ్డి తాను టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం తనకు మొండి చేయి చూపించిందని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో కూడా టిక్కెట్ ఆశించిన తనకు 2023లో తప్పకుండా టిక్కెట్ ఇస్తామని వాగ్దానం చేయడం వల్ల పార్టీపై నమ్మకంతో పార్టీ అభివృద్దికి కృషి చేశానన్నారు. తనకి టికెట్ ఇవ్వకపోవటంతో కన్నీటిపర్యంతం అయ్యారు.
పార్టీ టిక్కెట్ ఇవ్వకున్నా తాను ఒంటరిగానైనా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రమేష్ రెడ్డి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున బరిలో ఉంటాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరో వైపు తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్ ను కాదని ఇటీవల బిఆర్ఎస్ నుంచి వచ్చిన గిడ్డంగుల సంస్ధ మాజీ చైర్మన్ మందుల సామేల్ కు టిక్కెట్ ఇవ్వడంపై దయాకర్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది.
ఈ సారి గెలుపు తధ్యం అనుకున్న సమయంలో పార్టీ అభ్యర్ధి మార్చడంతో ఆయన ఒంటరిగా బరిలో ఉంటారనే టాక్ వినిపిస్తోంది. నిన్న అభ్యర్థుల ప్రకటనకు ముందే అద్దంకి దయాకర్ నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఒంటరిగా పోటీకి దిగుతారా లేక అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తారా అనేది చర్చనీయంశంగా మారింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications