కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట: 2011 నాటి కేసు కొట్టివేత
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)కు హైకోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన రైల్ రోకో కేసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో రైల్ రోకో నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌ను 13వ నిందితుడిగా రైల్వే పోలీసులు చేర్చారు. ఈ మేరకు ప్రతినిధుల కోర్టులో పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ కేసు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేసును కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

రైల్ రోకో జరిగిన సమయంలో కేసీఆర్ సంఘటన స్థలంలో లేరని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కేసీఆర్ పిలుపుతోనే రైల్ రోకో నిర్వహించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. కేసీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు నమోదు
ఫేక్ వీడియోలు వైరల్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ దిలీప్, క్రిశాంక్‌పై 353, 1(సీ), 353(2), 192, 196(1), 61(1)(ఏ) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వీడియోలు సృష్టించి వైరల్ చేశారని అభియోగం మోపారు. వీడియోలు ఎడిట్ చేసి ప్రజల్లో అశాంతి రేపెలా, రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ, ఎక్స్‌లో వైరల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications