రుణమాఫీ అమల్లో కొత్త ట్విస్ట్- వారికి లేనట్లే, పరిమితి ఖరారు..!!
తెలంగాణలో రుణమాఫీ అమల్లో కొత్త ట్విస్ట్. రుణమాఫీ అమల్లో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్దం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత రూ 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు 15 ఇందుకు డెడ లైన్ ఫిక్స్ చేసారు. అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ఆలోచనలు అమలు అయితే రూ 25 వేల కోట్లతో హామీ అమలు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
పీఎం కిసాన్ తో లింకు
రాష్ట్రంలో రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం- కిసాన్) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి ప్రభుత్వం ఉంటుందని అధికారులు కసరత్తు చేస్తోంది. ఇవే మార్గదర్శకాలను అమలు చేయటం ద్వారా ప్రభుత్వం పైన భారం తగ్గుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికీ రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే.. రూ.35 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారుల అంచనా. అదే పీఎం-కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే రూ.25 వేల కోట్లతో రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తుది కసరత్తు
అయితే, ఈ నిబంధనలు అమలు చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతందా అనే సందేహాలు ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. దీంతో, రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా అమలు చేయాలనేది సీఎం రేవంత్ ఆలోచన. ప్రస్తుతంకేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం- కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కారు.. 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. అధిక ఆదాయాన్ని పొందుతూ వివిధ రంగాల్లో ఉన్న వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. కానీ, నాలుగో తరగతి సిబ్బందికి మాత్రం ప్రయోజనం అందుతోంది.

మంత్రివర్గంలో నిర్ణయం
రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్నవారి సంఖ్య 47 లక్షలు కాగా.. వారి బ్యాంకు, రుణ ఖాతాలు, ఆధార్, పాన్‌కార్డు నంబర్లన్నింటిని సీడింగ్ చేసి జల్లెడ పడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేలే అవకాశం ఉంది. 'ధరణి' పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది పట్టాదారు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. అయితే ఇందులో పీఎం- కిసాన్ లబ్ధిదారులు మాత్రం సుమారు 33 లక్షల మందే ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న పట్టాదారుల్లో సగం మందికి మాత్రమే పీఎం- కిసాన్ పథకం అమలవుతోంది. పీఎం- కిసాన్ మోడల్‌ను తీసుకోవాలా? ఇతర రాష్ట్రాల్లో అమలుచేసినట్లు చేయాలా? అనే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించి అధికారికంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications