మా సీట్లు మావేనన్న రేవంత్ రెడ్డి
మా సీట్లు మావేనన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య కలిశారు. ఈ నెల 21తో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాలని, 12 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకూ మా సంఖ్య పదిహేనే అని, ఆ ప్రకారమే అసెంబ్లీలో సీట్ల కేటాయింపు, శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు స్పీకర్ ను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications