కొడంగల్‌లో నాతో పోటీకి సిద్ధమా: కేసీఆర్-కేటీఆర్‌లకు రేవంత్ సవాల్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు సవాల్ విసిరారు.
దరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు సవాల్ విసిరారు.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనతో పోటీకి వారు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ వంద అబద్దాలు చెప్పి అధికారంలోకి రాగానే, వెయ్యి అబద్దాలు చెప్పేందుకు కేటీఆర్ ఊరూరు తిరుగుతున్నారన్నారు.

తెరాస ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. కేటీఆర్ నిర్వహించిన జనహిత జాగృతి సభకు ధీటుగా ఈ నెల 28వ తేదీన తాండురులోని అదే మైదానంలో ప్రజాపోరు సభ నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications