Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల రగడ: దిష్టిబొమ్మల దహనాలు; డీజీపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు!!

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల రగడ రాష్ట్రంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనాలు నిర్వహిస్తున్నారు. డీజీపీని కలిసిన ఎమ్మెల్సీల బృందం ఫిర్యాదు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మావోయిస్టులు ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలని , ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ దేనికని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మలు దహనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పైన ములుగు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక తాజాగా బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల బృందం డిజిపిని కలిసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.

డీజీపీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన బీఆర్యఎస్ ఎమ్మెల్సీల బృందం

డీజీపీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన బీఆర్యఎస్ ఎమ్మెల్సీల బృందం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం నేడు తెలంగాణ డిజిపి అంజనీకుమార్ కు రేవంత్ రెడ్డి వ్యవహారం పై ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయం మరియు నివాసాన్ని గ్రనైడ్లు పెట్టి పేల్చివేయాల్సిందిగా చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చట్ట వ్యతిరేకమైన చర్యగా దీనిని భావించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి , తక్కెళ్ళపల్లి రవీందర్, ఎల్ రమణ తదితరులు డిజిపి కి ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల రగడ : శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల రగడ : శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు

నిన్న ములుగు పాదయాత్రలో భాగంగా టిపిసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేయాలని , బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలువు మేరకు నేడు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించారు.

పీ.డీ యాక్ట్ నమోదు చేసి ఎంపీ పదవి నుండి రేవంత్ ను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్

పీ.డీ యాక్ట్ నమోదు చేసి ఎంపీ పదవి నుండి రేవంత్ ను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు. నాలుగు కోట్ల ప్రజల యొక్క పరిపాలనా భవనమైనట్టి "ప్రగతి భవన్" ను నక్సలైట్లు పేల్చేయాలని బహిరంగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ ఎంపీ హోదాలో ఉండి ఇలా మాట్లాడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చేసిన ప్రసంగాన్ని సుమోటోగా తీసుకుని పీ.డీ యాక్ట్ నమోదు చేసి ఎంపీ పదవి నుండి రేవంత్ ను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

అదేవిధంగా బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు తప్పులేదు కానీ అసత్య ప్రచారాలతో అబద్ధపు మాటలతో గౌరవ బి.ఆర్.ఎస్ నాయకులపై, పార్టీపై చౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

వర్గ పోరుతో హద్దు, అదుపులేని కాంగ్రెస్ పార్టీ నాయకుల విచిత్ర ప్రవర్తనను ప్రజలు ఎండగట్టే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. మాటతీరు మార్చుకోకపోతే కాలంచెల్లిన పార్టీకి, క్రమ శిక్షణ లేని పార్టీకి బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కొందరు రేవంత్ రెడ్డి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+