కేసీఆర్ అందుకే అసెంబ్లీకి రావడం లేదు!
కొడంగల్ నివాసంలో "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్" జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడారన్నారు. మహాత్మా గాంధీని చంపినవారిని ప్రోత్సహించేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరివర్తన జరిగింది. ప్రజలు కనిపించని దేవుడిగా అంబేద్కర్‌ను కొలుస్తున్నారు. ప్రతీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని ఆయనను ఆరాధిస్తున్నారు. అలాంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతీ చోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు.

ముఖ్యమంత్రిగా నాకు ఈ బలం... ఈ శక్తి మీరిచ్చింది. అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందని కేసీఆర్ రావడంలేదు. వచ్చినవాళ్లకు ఓనమాలు కూడా రావు.... చెప్పినా నేర్చుకోరు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్‌కు పోయిందని వాళ్లకు దుఃఖం. అందుకే కొడంగల్‌ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.
రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్‌ను కంచె వేసుకుని కాపాడుకునే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్‌కే ఉంటుంది. పదేళ్లలో కొడంగల్‌ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని... భూసేకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు అక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. పరిశ్రమలు మన దగ్గర లేకపోవడం వల్లే మన ప్రాంత ప్రజలు వలసలు వెళుతున్నారు. ఇక్కడకు పరిశ్రమలు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా తాపత్రయం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వచ్చే ఐదేళ్లలో మరో పదివేల కోట్లతో కొడంగల్‌ను అద్దంలా తీర్చిదిద్దాలన్నది నా కోరిక. మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు... నాయకుడిగా మీ ప్రేమ నాకు చాలు. డీజిల్‌కు పైసలు వసూలు చేసినవాళ్లు ఇవాళ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.అభివృద్ధిని అడ్డుకుంటే అందరం మునుగిపోతామని సీఎం రేవంత్ హెచ్చరించారు. కొడంగల్ భూముల విలువ ఎకరానికి కోటి పెరగాలంటే ఇక్కడ అభివృద్ధి జరగాలి. అభివృద్ధికి అడ్డుపడి ఆపాలని చూసే ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications