కాంగ్రెస్ లో చేరి రేవంత్ తప్పు చేశాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రమని... అందులోకి వెళ్లిన రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా? అనే అనుమానాన్ని తలసాని వ్యక్తం చేశారు. అదే టీడీపీలో అయితే రేవంత్ కు ఒక పదవి ఉండేదని, ఒక ఆఫీస్, ఒక ఛాంబర్ ఉం
హైదరాబాద్: కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందిస్తూ.. ఆయన ఇలా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రమని... అందులోకి వెళ్లిన రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా? అనే అనుమానాన్ని తలసాని వ్యక్తం చేశారు. అదే టీడీపీలో అయితే రేవంత్ కు ఒక పదవి ఉండేదని, ఒక ఆఫీస్, ఒక ఛాంబర్ ఉండేవని... రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా పర్యటించి, తన గళం వినిపించే స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ జిల్లాల్లో పర్యటించగలరా? అని అన్నారు. కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇతర నేతలు తమ ఇలాఖాలోకి రావడాన్ని ఇష్టపడరని... తాము ఓటమిపాలైనా సరే.. మరో నేతను అడుగుపెట్టనీయరని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications