రేవంత్ రెడ్డి దెబ్బకు దిగొచ్చిన ఎల్ అండ్ టీ సంస్థ; ఏం చేస్తుందంటే!!
తెలంగాణా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి రేవంత్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఎల్అండ్ టీ సంస్థతో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించింది. దీంతో దిగొచ్చిన ఎల్అండ్ టీ సంస్థ సైలెంట్ గా కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ పనులు చేస్తుంది.
ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఏడవ బ్లాక్ లోని మూడు పిల్లర్లు కుంగిపోవడం, దీంతో బ్యారేజీ మీద పగుళ్లు ఏర్పడడం జరిగింది. ఇది సరిగ్గా ఎన్నికల సమయంలోనే జరగడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది తీవ్ర నష్టం చేసింది. దీంతో మరమ్మత్తు పనుల వ్యయాన్ని ఎల్ అండ్ టి సంస్థనే భరిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇక ఇదే విషయాన్ని సంస్థ యాజమాన్యం కూడా ప్రకటించింది. మరమ్మత్తు ఖర్చులు అన్నీ తామే భరిస్తామని ప్రకటించింది. అయితే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావడం పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్లేటు ఫిరాయించిన ఎల్ అండ్ టి సంస్థ మరమ్మత్తుల విషయంలో మాట మార్చింది. మరమ్మత్తులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరించాలని తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.
ఆ తర్వాత ఎల్ అండ్ టి సంస్థతో సమీక్ష సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమీక్షలో వారితో ఏం మాట్లాడారో, ఏం వార్నింగ్ ఇచ్చారో తెలియదు కానీ ఎల్ అండ్ టి సంస్థ సైలెంట్ గా మరమ్మత్తు పనులు మొదలు పెట్టింది. ఈ మరమ్మత్తు పనులకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయం ఉందని కంపెనీ అంచనా వేసింది.
ఈ మొత్తాన్ని కూడా కంపెనీనే పెట్టుకుని మరమ్మతులు చేస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి దెబ్బకు ఎల్ అండ్ టీ సంస్థ దిగొచ్చింది అని భావిస్తున్నారు. మరమ్మత్తు పనులు చేస్తున్న ప్రాంతమంతా మహారాష్ట్ర వైపు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ సంస్థ పనులను మొదలు పెట్టిందని సమాచారం.












Click it and Unblock the Notifications