ఆత్మహత్యకు ముందే బస్సుకింద పడపోయిన రైతు, ఫ్యామిలికీ 50వేలిచ్చిన రేవంత్ (పిక్చర్స్)

హైదరాబాద్: అప్పుల బాధ తాళలేక లింబయ్య అనే రైతు బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతను ఆత్మహత్యకు ముందు బస్సుకింద పడపోతే ఓ కానిస్టేబుల్ రక్షించాడు. ఆ తర్వాత కట్టమైసమ్మ ఆలయానికి వెళ్లి, పూజారికి రూ.10వేలు కానుకగా ఇచ్చాడు.

ఆ తర్వాత విద్యుత్ స్తంభానికి ఉరేసుకున్నాడు. అతడి సెల్‌ఫోన్‌లోని 2 నంబర్లకు ఫోన్ చేయగా పేరు, వివరాలు తెలిశాయని మధ్యమండలం డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి ఇందిరా పార్కు వైపు వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో... వెనుక నుంచి లింబయ్య బస్సు కింద పడేందుకు ఎదురుగా వేగంగా పరిగెత్తాడు.

వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ లింబయ్యను పక్కకు లాగాడు. తన వద్ద కూర్చోబెట్టుకుని, నీళ్లు తాగించాడు. అనంతరం సదరు కానిస్టేబుల్... కాసేపు కట్ట మైసమ్మ ఆలయం వద్ద కూర్చోమని చెప్పాడు. ఇది జరిగిన అరగంటకే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎవరో ఉరేసుకున్నారని కానిసేట్బుల్‌కు తెలిసింది.

అతనే లింబయ్య అని తెలిసి వాపోయాడు. తనతో పాటు కూర్చండబెట్టుకున్నా ప్రాణం దక్కేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, టిడిపి యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

రైతు లింబయ్య అప్పుల బాధకు తోడు కుటుంబ సమస్యలు తట్టుకోలేక హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

 రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే 1300 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు.
రైతు ఆత్మహత్యల పైన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావుల పైన కేసులు నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

వ్యవసాయ మంత్రి నడవలేని స్థితిలో వైద్యం చేయించుకుంటున్నారని, ఆయన గురించి ఏం మాట్లాడినా ప్రయోజనం లేదన్నారు. మంత్రి హరీష్ రావు రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి రూ.50వేల ఆర్థిక సాయం చేశారు.

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ ఫాంహౌస్లో పెరుగన్నం తింటుంటే రైతులు మాత్రం పురుగుల మందు తిని చస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన పంటల మీద కెసిఆర్ నెలకు నాలుగైదుసార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారని, కానీ సాధారణ రైతుల పంటల పరిస్థితి పైన మాత్రం ఒక్క సమీక్ష పెట్టడం లేదన్నారు.

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి పరామర్శ

వందలమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ రుణభారం నుంచి వారికి విముక్తి కావడం లేదన్నారు. కొత్తగా రుణాలు ఇప్పించడం మాత్రం చేయలేకపోతున్నారన్నారు. దయచేసి రైతులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, కెసిఆర్ మెడలు వంచి అయినా మిమ్మల్ని ఆదుకునేలా చేస్తానని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+