మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మరో తీపికబురు.. పండుగ చేస్కొండి!
తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే రేవంత్ సర్కార్ త్వరలోనే వడ్డీలేని రుణాలను ఇస్తామని ప్రకటన చేసి మహిళా సంఘాలకు ఆర్థికంగా అండగా నిలవడానికి తమ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుందో చెప్తుంది. ఇక ఇదే సమయంలో తాజాగా మరొక శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్.
ఆ పథకం కొనసాగించాలని జీవో జారీ
మహిళా స్వయం సహాయక సభ్యుల ప్రమాద బీమా పథకం పైన తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక జీవోను కూడా జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్త్రీనిధి ద్వారా బీమా అమలును కొనసాగించాలని నిర్ణయించి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.

స్వయం సహాయక గ్రూపుల మహిళలకు ప్రమాద బీమా
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రమాద బీమా లో స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
తెలంగాణాలో ఇప్పటివరకు ప్రమాద బీమా అందిన కుటుంబాలివే
స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు కష్టకాలంలో ప్రమాద బీమా తో భరోసాను ఇస్తుంది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ప్రమాద బీమా ద్వారా 409 మంది కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించారు. ప్రమాద బీమా ఇస్తున్న ధీమాతో మహిళలు చాలామంది స్వయం సహాయక సంఘాలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మహిళల ప్రమాద బీమా పథకం పొడిగింపు
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 1. 67 లక్షల మంది ఇటీవల కాలంలో కొత్త సభ్యులుగా స్వయం సహాయక మహిళా సంఘాలలో చేరారు. ఈ నేపథ్యంలోనే మరో నాలుగు సంవత్సరాల పాటు ప్రమాద బీమా పథకాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది












Click it and Unblock the Notifications