మోడీ, అమిత్ షాను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి: కేసీఆర్‌పై సెటైర్లు

కరీంనగర్: అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఆరోపించారు. జమ్మికుంట జన జాతర సభ, భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారని ఆరోపించారు.

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతోనే బీజేపీ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ, అమిత్‌ షా కుట్ర చేస్తున్నారన్నారు. అందుకోసమే 400 స్థానాల్లో గెలిపించాలని బీజేపీ అడుగుతుందని, మళ్లీ గెలిస్తే మాత్రం రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్పుకొచ్చారు. బీజేపీతో తాను పొత్తు పెట్టుకున్నానని కేసీఆర్‌ చెబుతుండటం హాస్యాస్పదమన్నారు రేవంత్.

Revanth reddy hits out at bjp and brs in jammikunta and regonda jana jatara sabha

మెున్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్‌ను తలపిస్తే.. అందులో కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని అదే స్ఫూర్తితో ఫైనల్స్‌లో మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌కు తెచ్చింది ఏం లేదన్నారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది శూన్యమని, గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, అందుకే కేసీఆర్ బస్సులో తిరుగుతున్నారని అన్నారు. తనను అరెస్ట్ చేయాలని అమిత్ షా ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించారని చెప్పుకొచ్చారు. గుజరాత్ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందామన్నారు. ఢిల్లీ పోలీసులు కాదు.. సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను అని రేవంత్ అన్నారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+