వచ్చే ఎన్నికల్లోనూ గుండు సున్నే: కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ సెటైర్లు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్‌కర్నూలు జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జైపాల్ రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని.. ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్ రెడ్డి వివరించి ఒప్పించారని గుర్తు చేశారు. 2014లో జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. జులై 31 లోపే రెండో విడత రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో ముచ్చెర్లలో స్కి్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని సీఎం చెప్పారు.

Revanth Reddy hits out at KCR and KTR in kalwakurthy public meeting

కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, రహదారుల కోసం రూ. 180 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఆమన్‌గల్‌‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని తెలిపారు.

కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు హైదరాబాద్ కు నాలుగు లేన్ల రహదారి తెస్తామని, దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఇప్పటికే మాట్లాడమని సీఎం చెప్పారు. తాను చదువుకున్న తాండ్ర హైస్కూల్ అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాడుగుల మండల కేంద్రంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

మరోవైపు, బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. అధికారం కోల్పోయిన బాధ కేసీఆర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ప్రజలు చీకొట్టినా కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి మారలేదన్నారు. తమ ఎన్నికలు అయిపోయాని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఊరుకు తిరిగి తమ కార్యకర్తను గెలిపిస్తామన్నారు. అంతేగాక, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి గుండుసున్నానే వస్తుందని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+