రేవంత్ రెడ్డికి ప్రాణహానీ, ఇంటి చుట్టూ రెక్కీ: సోదరుడి సంచలనం
కొడంగల్: ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డికి ప్రాణహానీ ఉందని చెబుతున్నారు. రేవంత్ సోదరుడు కృష్ణా రెడ్డి శనివారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను అంతమొందించేందుకు కొందరు వ్యక్తులు రంగంలోకి దిగినట్లుగా అనుమానం కలుగుతోందన్నారు.
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పాల్గొంటున్న పలు కార్యక్రమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వం కక్ష కట్టి కేసులో ఇరికించిందన్నారు. తన అన్నకు ప్రాణ హానీ ఉన్న దృష్ట్యా, ప్రభుత్వం రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రాణహానీ ఉందని పోలీసు అధికారులే చెబుతున్నారని అంటున్నారు. రేవంత్ ఇంటికి ప్రతి రోజు పలువురు వచ్చి వెళ్తుంటారు. నేరుగా ఆయన ఇంట్లోకి చాలామంది వెళ్తుంటారు. ఆయనను టార్గెట్ చేసుకున్న వారికి ఇది అనుకూలంగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. రేవంత్‌కు త్రీ ప్లస్ త్రీ భద్రత ఉంది.












Click it and Unblock the Notifications