నచ్చిన వారికి కాదు, వారికే బీ ఫారాలు..పదవులు- తేల్చేసిన రేవంత్..!!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు కావటంతో.. ఇప్పుడు బీఫారాలు పార్టీలకు పరీక్షగా మారాయి. రెబల్స్ బెడద ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. దీంతో.. సీఎం రేవంత్ పార్టీ నేతలను అప్రమత్తం చేసారు. బీఫారాలు ఎవరికి ఇవ్వాలో తేల్చి చెప్పారు. అదే విధంగా నేతలంతా కలిసి కట్టుగా పని చేయాలని నిర్దేశించారు. మేయర్.. ఛైర్మన్ పదవుల ఖరారు పైన స్పష్టత ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు కావటం తో ఇప్పుడు అభ్యర్ధులను బీ ఫారాలు ఇవ్వాల్సి ఉంది. ఇదే అంశం పైన పార్టీ నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. నామినేషన్లు వేసి తమకే బీ ఫారాలు వస్తాయని ఆశిస్తున్న వారికి దక్కకపోతే రెబల్స్ గా బరిలోకి దిగే అవకాశం ఉండటం.. పార్టీలకు సమస్యగా మారుతోంది. దీంతో, నచ్చిన వారికి కాకుండా.. గెలిచే వారికే బీ ఫారాలు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్దేశించారు.

అమెరికా పర్యటన లో ఉన్న రేవంత్ పార్టీ ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌ఛార్జ్ మీనాక్షి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను టీపీసీసీ చీఫ్ సీఎంకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానా లను కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ నిర్దేశించారు. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలనిముఖ్యమంత్రి సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా.. నేతలంతా కలిసి కట్టుగా అభ్యర్ధుల గెలుపుకు పని చేయాలని నిర్దేశించారు.
గెలుపు వ్యూహాల పై దిశా నిర్దేశం
అదే విధంగా మేయర్.. ఛైర్మన్ల ను ప్రకటించవద్దని స్పష్టం చేసారు. స్థానికంగా సామాజిక లెక్కల ను పరిగణలోకి తీసుకొని అభ్యర్ధులను ఖరారు చేయాలని రేవంత్ సూచించారు. ఈ నెల4వ తేదీ నుంచి రేవంత్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరే షన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీకి మినహాయింపునిచ్చారు. మొత్తం 2,996 వార్డులకు పోటీ జరగనుంది. ఈనెల 28 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
ఈ రోజు (శనివారం) నామినేషన్ల పరిశీలన జరుగ నుంది. ఫిబ్రవరి మూడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు రానున్నారు.












Click it and Unblock the Notifications