Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్, బాబు దోస్తీ: కాంగ్రెసులోకి రేవంత్ రెడ్డి, రాహుల్‌తో భేటీ?

రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.తెలంగాణలో టిడిపికి, తెరాసకు మధ్య సంబంధం పటిష్టం అవుతున్ననేపథ్యంలో ఆ ఆలోచన చేస్తున్నారని వినికిడి.ఆయన ఒకటి రెండు సార

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన దారి తాను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారనే ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య బంధం మరింత గట్టిపడింది.

ఇరువురు ముఖ్యమంత్రుల మధ్యనే కాకుండా ఇరు సామాజిక వర్గాల మధ్య కూడా సంబంధాలు బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఒంటరి అయిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎదుర్కోవాలనే తన లక్ష్యం తెలుగుదేశం పార్టీలో ఉంటే కుదరదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు, మాజీ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి లక్ష్యానికి అడ్డువస్తున్న అంశాలను ముందుకు తెచ్చింది.

 మోత్కుపల్లి ఏమన్నారు....

మోత్కుపల్లి ఏమన్నారు....

కాంగ్రెసు పార్టీతో టిడిపికి పొత్తు ఉండదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తు ఏమైనా ఉంటే బిజెపితో లేదా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలను ఒక తాటి మీదికి తెచ్చి కెసిఆర్‌ను ఎదుర్కోవాలనే రేవంత్ రెడ్డి ఆలోచనకు అది విఘాతం కలిగించే విధంగా ఉందనడంలో సందేహం లేదు. మోత్కుపల్లి మాటలకు అనుగుణంగానే చంద్రబాబు ఆలోచన ఉండవచ్చునని చెప్పడానికి ఇటీవలి పరిణామాలు అవకాశం కల్పిస్తున్నాయి.

ఎర్రబెల్లి ఇలా అన్నారు....

ఎర్రబెల్లి ఇలా అన్నారు....

రేవంత్ రెడ్డి తప్ప మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులంతా తెరాసలోకి వచ్చే స్థితిలో ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు గెలిచి, తెరాసలోకి మకాం మార్చారు. ఎర్రబెల్లి మాటలను బట్టి మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా తెరాసలోకి రప్పించేందుకు కెసిఆర్ వ్యూహం పన్నుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని తమ పార్టీ నేతలు తెరాసలో చేరినా చంద్రబాబు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీదనే ఉంది.

కెసిఆర్

కెసిఆర్

కెసిఆర్ ప్రధాన శత్రువు ఇప్పుడు కాంగ్రెసు పార్టీయే. దాన్ని దెబ్బ తీయాలనే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నారు. సామాజిక వర్గం కూర్పు కూడా ఆయనకు అందుకు అవకాశం కల్పిస్తోంది. ఒకే వర్గానికి చెందిన నాయకులు ఆ పార్టీలో ఎక్కువ మంది ఉండడం దానికి కారణం. ఈ స్థితిలో రేవంత్ రెడ్డికి తగిన వేదిక కాంగ్రెసు పార్టీయే అవుతుందని అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెసు నాయకులు కెసిఆర్‌ను ధీటుగా ఎదుర్కునే స్థితిలో లేరనే మాట కూడా వినిపిస్తోంది.

రాహుల్ గాంధీతో భేటీ...

రాహుల్ గాంధీతో భేటీ...

బిజెపి తనకు సరిపోదని భావిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెసిఆర్‌ను ఎదుర్కోగలిగే వాగ్ధాటి, సత్తా తనకు మాత్రమే ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే తన అనుచరులను కొంతమందికి టికెట్లు గ్యారంటీ చేసుకుని కాంగ్రెసులో చేరిపోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఆయన ఒకటి రెండు సార్లు రాహుల్ గాంధీని కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+