కేసీఆర్ కు బిగ్ షాక్ ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో బిఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, నేతలు రోజుకు ఒక అంశం పైన రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన కాస్త సానుకూలత వచ్చింది.
రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న కేటీఆర్, హరీష్ రావులు
ఇక ఆ తర్వాత వరుసగా రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల కోసం విదేశాలలో పర్యటించడం కూడా ఓ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సానుకూల అంశమే. అయితే వీటి పైన ప్రజల ఫోకస్ పడకుండా రేవంత్ సర్కార్ ను తమదైన శైలిలో టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావులు. కేటీఆర్, హరీష్ రావు చేసే వ్యాఖ్యలను తిప్పి కొట్టడంలో రేవంత్ క్యాబినెట్ మంత్రులు ఫెయిల్ అవుతున్నారు.

బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా ప్లాన్ చేసిన రేవంత్
ఇక ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా దానికోసం ఒక ప్లాన్ కూడా రెడీ చేసినట్టుగా సమాచారం. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే మరొకమారు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని, ఈ చేరికలతో బిఆర్ఎస్ నేతలకు షాక్ ఇవ్వాలని రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఇప్పటికే కాంగ్రెస్ కు దగ్గరగా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారని, రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లో అడుగు పెట్టగానే వరుసగా ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని చెబుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసిన నాయకులు పార్టీ మారబోతున్నారని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ మారే నాయకులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు.
రేవంత్ హైదరాబాద్ రాగానే ప్లాన్ అమలు
ఇందులో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న వేళ చివరి నిమిషం వరకు సస్పెన్షన్ కొనసాగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ హైదరాబాద్ రాగానే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిని అభినందిస్తూ వరుసగా హడావిడి చేయాలని ప్లాన్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇదే సమయంలో రేవంత్ ప్లాన్ లో భాగంగా బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది.
కేసీఆర్ కు చెక్ పెట్టనున్న రేవంత్
గ్రేటర్ హైదరాబాద్ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను రోజుకు ఒక్కొక్కరు చొప్పున పార్టీలో చేర్చుకోపోతున్నట్టు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో చర్చ జరుగుతుంది. తమపై మాటల దాటిన పెంచిన బీఆర్ఎస్ నేతలకు, అధినేత కేసీఆర్ కు చెక్ పెట్టే బిగ్ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ఇది ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications