గెలుపు ఊపుతో రేవంత్ రెడ్డి లేటెస్ట్ అనౌన్స్ మెంట్: రోడ్ మ్యాప్

తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8 వ తేదీన రెండో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని అదే నెల వ తేదీన ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రోడ్ మ్యాప్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పోలీస్ డైరెక్టర్ జనరల్ బీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Revanth Reddy s Insightful Review of Preparations for the Telangana Rising and Praja Palana

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రూపొందించే పాలసీ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని, విధానపరమైన ప్రణాళిక ఉంటే పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. పెట్టుబడులను రాబట్టుకోవడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్రగామిగా కొనసాగుతుందని అన్నారు. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా పారిశ్రామిక విధానాలను అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు.

పాలసీ డాక్యుమెంట్ ప్రభుత్వంలోని శాఖల వారిగా ఉండాలని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారిగా పాలసీ డాక్యుమెంట్‌ సిద్ధం కావాలని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, సంబంధిత ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహిస్తారని, సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తుందని సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే నిర్లక్ష్యపు నిర్ణయాలు తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని, అలాగే అందుకు తగిన విధంగా భద్రత విషయంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+