వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గేరు మార్చిన రేవంత్.!ఓపక్క సభ్యత్వ నమోదు.!మరోపక్క చేరికలు.!కోలాహలంగా గాంధీ భవన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. డిజిటల్ సభ్యత్వంపై దృష్టి పెట్టిన రేవంత్ పార్ఠీలో చేరికలకు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రభుత్వంపైన అసంతృప్తి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపైన ఆక్రోశం ఉన్న నాయకులు రేవంత్ రెడ్డిని ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న నాయకులందరూ రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

 పార్టీ బలోపేతంపై రేవంత్ దృష్టి.. అట్నుంచి నరుక్కొస్తున్న పిసీసీ ఛీఫ్

పార్టీ బలోపేతంపై రేవంత్ దృష్టి.. అట్నుంచి నరుక్కొస్తున్న పిసీసీ ఛీఫ్

రేవంత్ రెడ్డి మొదలు పెట్టారు. పార్టీ ప్రక్షాళనతో పాటు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నారు. అందుకోసం అటునుంచి నరుక్కురావడం ప్రారంభించారు. మొదటగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాకానుండి చేరికలకు తెర తీసారు రేవంత్ రెడ్డి. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు 300 మంది పార్టీలో చేరారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం పై సంపూర్ణ విశ్వాసం తో పార్టీలో చేరారని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

 మంత్రి ఎర్రబెల్లి ఇలాకా నుంచి చేరికలు. ప్రభుత్వ తీరు పట్ల సహనం కోల్పోయామంటున్న నేతలు

మంత్రి ఎర్రబెల్లి ఇలాకా నుంచి చేరికలు. ప్రభుత్వ తీరు పట్ల సహనం కోల్పోయామంటున్న నేతలు

అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేసారని, గెలిచిన తర్వాత అభివృద్ధి పై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ ల పై మంత్రి ఎర్రబెల్లి సీఎం చంద్రశేఖర్ రావుపై ఒత్తిడి తేకపోవడం వల్ల ఎర్రబెల్లి పై విసిగిపోయారని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయకపోగా ఒకరికొకరు రాజకీయ ప్రయోజనం కోసం కొనుగోలు సమస్య ను పక్కదారి పట్టించారని అన్నారు. రైతుల ను పరమర్శించింది లేదు..ఆ కుటుంబలను ఆదు కోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

 బీజేపి టీఆర్ఎస్ డ్రామాలు.. కావాలనే వరి కొనుగోలు డ్రామా అన్న రేవంత్

బీజేపి టీఆర్ఎస్ డ్రామాలు.. కావాలనే వరి కొనుగోలు డ్రామా అన్న రేవంత్

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 126 జీవో ద్వార ఉద్యోగాల భర్తీ ,బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ను తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బండి, గుండు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జీవో రద్దు చేయవచ్చు, కానీ బీజేపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవో రద్దు చేస్తామని రాజకీయ డ్రామా ఆడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.

Recommended Video

Revanth Reddy నాయకత్వంలో పనిచేస్తానని వెంటబడ్డా .. Harshavardhan Reddy | GO 317 | Oneindia Telugu
 సమస్యలకు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాలి.. వినూత్న వ్యాఖ్యలు చేసిన రేవంత్

సమస్యలకు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాలి.. వినూత్న వ్యాఖ్యలు చేసిన రేవంత్

రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనుక ప్రధాని మోదీ, సీఎం చంద్రశేఖర్ రావు ఉన్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సమస్యలు అన్ని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. ఇదిలా ఉండగా గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జనగామ జిల్లా కు చెందిన వివిధ పార్టీల నేతలు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

English summary
Revant Reddy has increased his aggression in the Telangana Congress party. All the leaders who think that justice will be done to them by the Congress party are joining the Congress party led by Revanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X