దేశంలోనే రైతు సంక్షేమానికి విప్లవాత్మక పథకాలు.. కేసీఆర్ సర్కార్ ఘనత: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఒక్క పని కూడా చేయడం లేదని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పదేపదే రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతని ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్మర్స్ ఫస్ట్ అనేది కేవలం నినాదంగా మాత్రమే కాకుండా చేతుల్లో కూడా చూపించామని ఆయన తెలిపారు.
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ చేసింది చెప్పిన కేటీఆర్
ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని, కేసీఆర్ పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలని ప్రజలకు అర్థమయ్యేలా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో వ్యవసాయ రంగంలో కనీవిని విప్లవాత్మక మార్పులను కెసిఆర్ హయంలో తీసుకొచ్చినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఇది మా కేసీఆర్ సర్కార్ అతిపెద్ద ఘనత అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతల కోసం పథకాలు
రైతుల సంక్షేమం కోసం, సాగును కాపాడుకోవడం కోసం కేసీఆర్ రూపకల్పన చేసే అమలు చేసిన పలు పథకాల వివరాలను వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి ఆ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతల కోసం పథకాలు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయంలో రైతుబంధు అమలు చేశామని, 70లక్షల మంది రైతులకు 73వేల కోట్లను వారి ఖాతాలో వేసామని కేటీఆర్ తెలిపారు.
రైతు భీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్
ఇక రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతు భీమా పేరుతో ఐదు లక్షల రూపాయల జీవిత భీమా కల్పించామని కేటీఆర్ వెల్లడించారు. మొత్తం 25 వేల కోట్లతో రుణమాఫీ అమలు చేశామని, 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించామని పేర్కొన్నారు.
This is THE Biggest achievement of KCR Government ✊
— KTR (@KTRBRS) June 25, 2024
“Farmer First” was not a mere slogan. It was backed by some revolutionary policies
✳️ “Rythu Bandhu” - ₹73,000 Crore disbursed to 70 lakh farmers. India’s first Farm input assistance program
✳️ “Rythu Bhima” - ₹5 Lakh Life… https://t.co/bepGnotkTz
మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ఘనత
మిషన్ కాకతీయలో భాగంగా వేల చెరువులను పునరుద్ధరించిన ఘనత కూడా కేసీఆర్ దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పోస్ట్ ద్వారా తమ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూనే ప్రస్తుత ప్రభుత్వ ఏం చేస్తుందో రైతాంగం అంతా గమనించాలి అన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి ఎన్నో పథకాల ద్వారా పాటుపడిందని గుర్తు చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications