నాగార్జున కొండా సురేఖ మధ్య రాజీ వెనుక చక్రం తిప్పింది ఆయనే!
ఎట్టకేలకు కొండా సురేఖ నాగార్జున మధ్య వివాదం సద్దుమణిగింది. నాగార్జున కుటుంబం పైన, సమంత నాగచైతన్య ల పైన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పడంతో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ పై వేసిన క్రిమినల్ కేసును నటుడు నాగార్జున ఉపసంహరించుకున్నారు.
నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
నాగార్జున కుటుంబం పైన తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నాను అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నాగార్జునను, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని కానీ తన ఉద్దేశం కాదని, తాను చేసిన వ్యాఖ్యలలో ఏదైనా పొరపాటు ఉంటే చింతిస్తున్నాను అన్నారు.

నాగార్జున, కొండా సురేఖ మధ్య రాజీ చేసింది ఆయనే
తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అయితే ఈ విషయం పైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ, నాగార్జున ల మధ్య కేసు ఉపసంహరణ వెనుక ఏం జరిగింది? వీరిద్దరికీ రాజీ చేయడానికి కీలక భూమిక పోషించింది ఎవరు? అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. అయితే వీరిద్దరి మధ్య రాజీ వెనుక ఆర్జీవి ఉన్నాడు అన్న చర్చ ఆసక్తిని కలిగిస్తోంది.
కొండా కుటుంబానికి దగ్గరగా ఆర్జీవీ
ఇటీవల శివ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆర్జీవి నాగార్జునను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సురేఖ పైన ఉన్న పరువు నష్టం దావా కేసు విషయంలో ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. రాంగోపాల్ వర్మ కొండ కుటుంబానికి కూడా సన్నిహితుడుగా ఉండడం, కొండా మురళి మీద కొండ పేరుతో సినిమా తీయడంతో వారి కుటుంబానికి మరింత చేరువయ్యాడు.
వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన రాం గోపాల్ వర్మ
ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఇద్దరి మధ్య ఉన్న వివాదానికి పుల్ స్టాప్ పెట్టి రాజీ కోసం ప్రయత్నం చేసి కేసు లేకుండా చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆర్జీవి డైరెక్షన్ తోనే కొండా సురేఖ నిన్న నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications