హైదరాబాద్ TO కర్ణాటక ట్రిప్.. తక్కువ బడ్జెట్ లో.. న్యూ ఇయర్ ఆఫర్..
న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కొత్త సంవత్సరాన్ని ఉల్లాసంగా.. మరింత ఉత్సాహంగా ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా కర్ణాటక ట్రిప్ ను తక్కువ ధరకే ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి బడ్జెట్ లో కర్ణాటకలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టేసి రావచ్చు. మొత్తం 6 రోజుల టూర్ లో భాగంగా.. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరితో పాటు పలు ప్రాంతాలను సందర్శించొచ్చు.
కొత్త సంవత్సరాన్ని మరింత నూతనంగా ప్రారంభించేందుకు.. IRCTC ప్రత్యేక దేవాలయాల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటకలో అనేక చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని సముద్ర తీరంలో ఉన్న మురుడేశ్వర్, శృంగేరీ, ఉడిపి ప్రాంతాలను చూసేందుకు IRCTC ఈ ప్రత్యేక ట్రిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బడ్జెట్ లోనే ఈ టూర్ ను ఆస్వాదించవచ్చు.
ఇక ఈ ప్యాకేజీ విషయానికి వస్తే.. జనవరి 6, 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలోనూ వెళ్లొచ్చు. టూర్ లో భాగంగా మొదటి రోజు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ TO మంగళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్ (నెంబర్ 12789) ట్రైన్ స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు ఉదయం 10 గంటలకు మంగళూరు స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉడిపి వెళ్తారు. ఉడిపిలోని శ్రీ కృష్ణ టెంపుల్ అలాగే మాల్పె బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు. ఇక మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్లి మూకాంబిక ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్ వెళ్లి భారీ శివుడి విగ్రహాన్ని దర్శించుకుంటారు. అక్కడి బీచ్ లను చూసి తిరిగి ఉడిపి చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
ఇక నాలుగో రోజు ఉదయం ఉడిపి నుంచి హోర్నాడు వెళ్తారు. అక్కడ అన్నపూర్ణ ఆలయాన్ని దర్శించుకుని శృంగేరికి చేరుకోవాలి. అక్కడే శారదాంబ ఆలయం సందర్శించిన తర్వాత సాయంత్రం మంగళూరు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది. ఐదో రోజు మొత్తం మంగళూరులోని మంగళాదేవి, కద్రి మంజునాథ, కుండ్రోలి గోకర్నాథ ఆలయాలు దర్శించి, తన్నేర్బవి బీచ్‌లో కొద్దిసేపు ఎంజాయ్ చేసి అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు కాచిగూడ చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

ఇక ఈ ప్యాకేజీ ధరల వివరాలు ఓసారి చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 41,630 ఉంటుంది. అలాగే డబుల్ షేరింగ్ కు రూ. 23,670 ఉంటుంది. ఇక ట్రిపుల్ షేరింగ్ ధర రూ.19,000 గా ఉంది. కంపోర్ట్ క్లాస్ 3Aలో అయితే ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 15,970, సింగిల్ షేరింగ్ కు రూ. 38, 600.. డబుల్ షేరింగ్ రూ. 20, 650గా ఉంది. పిల్లలకు సెపరేట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం 8287932229 లేదా 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ప్యాకేజీ వివరాల కోసం IRCTC టూరిజం వెబ్ సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications