ఔటర్‌పై ఘోరం: చిన్నారితోపాటు నలుగురు సజీవదహనం(పిక్చర్స్)
నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
హైదారాబాద్: నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
వివరాలిలా ఉన్నాయి.. పెద్దఅంబర్‌పేట వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైనకారు నంబర్‌ను టీఎస్03 ఈఎల్3551గా గుర్తించారు.
కాగా, ప్రమాదానికి గురైన కారు యజమాని వరంగల్ జిల్లా పందెల రాజేశ్వరిగా పోలీసులు గుర్తించారు. బాధితుల సమాచారం తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఘటనా స్థలం వద్ద..
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట సమీపంలో బాహ్యవలయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు.

నలుగురు సజీవదహనం
ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రయాణిస్తున్న ఆల్టో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు సజీవ దహనమయ్యారు.

మంటల్లో చిక్కుకుని
ప్రమాదానికి గురైన కారు నంబర్ టీఎస్03 ఈఎల్6551... సందెల రాజేశ్వరి పేరిట వరంగల్ ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

వేగంగా డివైడన్‌ను ఢీకొట్టి..
దహనమైన కారులో లక్ష్మీ అనే మహిళ పేరుతో రేషన్ కార్డు లభ్యమైంది. హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications