ఏపీలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు రమ్య, గోపీనాథ్, వారి పిల్లలు సాహిత్, హాసిని, మరో బంధువుతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌‌కు కారులో వస్తున్నారు.

 Road accident in Andhra Pradesh: Telangana Techie couple killed, two children injured

ఈ క్రమంలో పర్వతదేవరపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రమ్య, గోపీనాథ్ అక్కడికక్కడే చనిపోయారు. వారి బంధువు తారకేశ్వరి, చిన్నారులు సాహిత్, హాసిని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకేశ్వరి మృతి చెందారు. గాయపడిన చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాద ఘటనపై సమాచారం అందడంతో వరంగల్‌లోని రమ్య, గోపీ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+