పెళ్లై నెల కూడా కాలేదు: కొత్త జంటను వెంటాడిన మృత్యువు
కరీంనగర్: ఎన్నో ఆశలు.. మరెన్నో ఊసులు, కలలతో కొత్తగా దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన ఆ జంటను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ కొత్త జంట మరణంతో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఈ ఘటన జగిత్యాల మండలం చల్‌గల్-తాటిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లి వచ్చిన జగిత్యాల మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన నాగపూరి నరేశ్ (25), సారంగపూర్ మండలం తుంగూరుకు చెందిన మంగ(23)లకు ఆగస్టు 23న వివాహం జరిగింది.

కాగా, మంగళవారం దంపతులిద్దరూ బైక్‌పై మేడిపల్లి మండలం కొండాపూర్‌లోని నరేశ్ అమ్మమ్మ ఇంటికెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు వెంటాడింది.
నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ.. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. తాటిపల్లి గ్రామస్థులు లారీని వెంబడించి మేడిపల్లి వద్ద పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నవదంపతుల మృతితో ఇరు కుటుంబాలతోపాటు వారి రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications